పిల్లల దుస్తుల కొనుగోలులో కాన్యే వెస్ట్ బిజీ ! బిజీ !

| Edited By: Pardhasaradhi Peri

Jul 23, 2020 | 6:23 PM

అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ మెల్లగా మళ్ళీ మామూలు మనిషవుతున్నట్టు కనిపిస్తోంది.  ఇతడు బుధవారం తన స్నేహితులతో కలిసి.. ఓ షాపింగ్ మాల్ లో పిల్లల బట్టలు కొంటూ కనిపించాడు. తన భార్య కిమ్ కర్దాషియన్ కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు..

పిల్లల దుస్తుల కొనుగోలులో కాన్యే వెస్ట్ బిజీ ! బిజీ !
Follow us on

అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ మెల్లగా మళ్ళీ మామూలు మనిషవుతున్నట్టు కనిపిస్తోంది.  ఇతడు బుధవారం తన స్నేహితులతో కలిసి.. ఓ షాపింగ్ మాల్ లో పిల్లల బట్టలు కొంటూ కనిపించాడు. తన భార్య కిమ్ కర్దాషియన్ కి విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించిన కాన్యే… మెంటల్ డిజార్డర్ నుంచి కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. భార్యకు, పిల్లలకు దూరం కావాలనుకున్న ఇతనికి పిల్లలమీద ప్రేమ మాత్రం చెక్కుచెదరలేదని తెలుస్తూనే ఉంది. తన భర్త విడాకుల తాలూకు ‘ప్రకటన’ తెలిసినా…… కిమ్ మాత్రం కూల్ గా ఉంది. అతని ప్రవర్తనపై తనకు ఎలాంటి అధికారాలూ లేవని, పేర్కొన్న ఆమె,, అతడ్ని బ్రిలియంట్ వ్యక్తి అని, కానీ….అదే సమయంలో ‘కాంప్లికేటెడ్ పర్సన్’ అని వ్యాఖ్యానించింది.

కాన్యే వెస్ట్ కి మానసిక దౌర్బల్యం ఉందనో, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడనో ఎవరైనా అనుకుంటే దానిపై స్పందించే అధికారాలు తమ కుటుంబానికి లేవని, చాలా డిప్లొమాటిక్ గా ఆమె తెలిపింది. ఒక్కోసారి అతని మాటలు అతని ఉద్దేశాలకు అనుగుణంగా ఉండవని కిమ్ పేర్కొంది. మొత్తానికి ఇదంతా టీ కప్పులో తేలిపోయే తుపానులాగా ఉన్నట్టే ఉంది.