‘డ్రగ్స్ తీసుకున్నానా? ప్రూవ్ చేయండి!’ కంగనా సవాల్

| Edited By: Pardhasaradhi Peri

Sep 08, 2020 | 6:48 PM

తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ముంబై పోలీసులకు సహకరించడంకన్నా నాకు సంతోషం ఏముంటుంది అని ఆమె ప్రశ్నించింది.

డ్రగ్స్ తీసుకున్నానా? ప్రూవ్ చేయండి! కంగనా సవాల్
Follow us on

తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపించాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. ముంబై పోలీసులకు సహకరించడంకన్నా నాకు సంతోషం ఏముంటుంది అని ఆమె ప్రశ్నించింది. డ్రగ్ టెస్టుకు తను సిధ్ధమేనని,  కావాలంటే తన కాల్ రికార్డులను వెరిఫై చేయాలని ఆమె కోరింది. నాకు, డ్రగ్ రాకెట్ కి ,మధ్య లింక్ ఉన్నట్టు తేలితే శాశ్వతంగా ముంబైని వీడి వెళ్లిపోతానని కూడా ఛాలెంజ్ చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం మంత్రి  అనిల్  దేశ్ ముఖ్ ని  ఉద్దేశించి కంగనా ట్వీట్ చేసింది.

కంగనా మాజీ బాయ్ ఫ్రెండ్ అధ్యాయన్ సుమన్ ఓ ఇంటర్వ్యూలో కంగనా డ్రగ్స్ తీసుకునేదని చెప్పడం, ఇదే అదనని దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోకి సుమన్ కూడా ఎంటరయ్యాడు.ఈ విషయంలో తన పేరును లాగవద్దని మీడియా ఛానల్స్ ని కోరాడు. కంగనాకు, ఈ ప్రభుత్వానికి మధ్య తలెత్తిన ఈ గొడవలో తాను భాగం కాదలచుకోలేదన్నాడు. దయచేసి నన్ను వదిలెయ్యండి అన్న టైపులో స్పందించాడు.