నాడు నా విజయం కోసం గుడిలో కొబ్బరి కాయలు కొట్టమన్నా, కమలా హారిస్

| Edited By: Pardhasaradhi Peri

Aug 17, 2020 | 7:16 PM

అమెరికా  ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ పదేపదే..ఇండియాతో..ముఖ్యంగా చెన్నైతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు..

నాడు నా విజయం కోసం గుడిలో కొబ్బరి కాయలు కొట్టమన్నా, కమలా హారిస్
Follow us on

అమెరికా  ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ పదేపదే..ఇండియాతో..ముఖ్యంగా చెన్నైతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2010 లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవికి జరిగిన ఎన్నికల్లో  పోటీ చేసినప్పుడు..తన గెలుపు కోసం గుడిలో కొబ్బరికాయలు కొట్టాలని చెన్నైలోని  తన అత్త సరళా గోపాలన్ ని కోరారట. చెన్నై బీసెంట్ నగర్ లోని ఆలయంలో ఆమె అలాగే 108 టెంకాయలు కొట్టారని, ఇందుకు రోజంతా పట్టిందని హారిస్ గతంలో  పేర్కొన్నారు. ఒకప్పటి తన అనుభవాలను, అనుభూతులను ఆమె తన ఇండియన్-అమెరికన్లతో పంచుకున్నారని న్యూయార్క్ టైమ్స్  ఓ ఆర్టికల్ లో ప్రచురించింది.

అలాగే చెన్నై బీచ్ లో తన తాతగారితో కలిసి వాకింగ్ చేసిన స్మృతులను కూడా ఆమె గుర్తుకు తెచ్చుకున్నారని ఈ ఆర్టికల్ వివరించింది.