మెక్సికోలో జర్నలిస్ట్ దారుణ హత్య

| Edited By: Pardhasaradhi Peri

Sep 10, 2020 | 4:25 PM

మెక్సికోలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీ, అతని బైక్ పడి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. స్థానిక డైలీలో పని చేసే జూలియో వాల్డీవియా అనే ఇతని..

మెక్సికోలో జర్నలిస్ట్ దారుణ హత్య
Follow us on

మెక్సికోలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీ, అతని బైక్ పడి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. స్థానిక డైలీలో పని చేసే జూలియో వాల్డీవియా అనే ఇతని తలను మొండెం నుంచి వేరు చేశారని, ఈ అమానుషాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి హ్యూగో అన్నారు. నేరస్థులను వెంటనే పట్టుకుంటామన్నారు. ఈ ఏడాది దేశంలో హత్యకు గురైన జర్నలిస్టుల్లో జూలియో అయిదో వ్యక్తి. ప్రపంచంలో పాత్రికేయులకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో మెక్సికో ఒకటి. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసేవారిని కిల్లర్ గ్యాంగులు నిర్దాక్షిణ్యంగా హతమారుస్తుంటాయి.  2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు వందమందికి పైగా జర్నలిస్టులు హతమయ్యారు.