యూఎస్… జో బిడెన్ డిజిటల్ ప్రచార సారథిగా ఇండో-అమెరికన్ మేథా రాజ్

| Edited By: Pardhasaradhi Peri

Jun 30, 2020 | 2:25 PM

ఇండో-అమెరికన్ మేథా రాజ్ కు అపూర్వ పదవి లభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్.. ఆమెను తన డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు. ఆయన తరఫున జరగనున్న డిజిటల్ ఎన్నికల..

యూఎస్... జో బిడెన్ డిజిటల్ ప్రచార సారథిగా ఇండో-అమెరికన్ మేథా రాజ్
Follow us on

ఇండో-అమెరికన్ మేథా రాజ్ కు అపూర్వ పదవి లభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్.. ఆమెను తన డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు. ఆయన తరఫున జరగనున్న డిజిటల్ ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. కోవిడ్-19 కారణంగా ఈ ప్రచారం అమెరికాలో వర్చ్యువల్ గా సాగనుంది. తన హోదాలో మేధా రాజ్ డిజిటల్ డిపార్ట్ మెంటును మొత్తం ‘ప్రక్షాళన’ చేస్తారని, డిజిటల్ ఔట్ ఫుట్ ప్రభావాన్ని గరిష్ట స్థాయిలో ఎలా వినియోగించుకోవాలో కో-ఆర్డినేట్ చేస్తారని జో బిడెన్ ప్రచార వర్గాలు తెలిపాయి. డిజిటల్ చీఫ్ స్టాఫ్ గా తనను బిడెన్ ప్రచార కూటమిలో భాగస్వామిని చేసినందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందని మేధా రాజ్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా 130  రోజుల సమయం ఉందని, ఇక ఒక్క నిముషం కూడా వృధా చేయబోనని ఆమె చెప్పారు. జార్జి టౌన్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న ఈమె.. స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాలయం నుంచి ఎంబీఏ డిగ్రీ అందుకున్నారు.

77 ఏళ్ళ జో బిడెన్.. 74 ఏళ్ళ రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పోటీ చేయనున్నారు. నవంబరు 3 న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. జో బిడెన్.. ట్రంప్ కన్నా 8 శాతం  పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాజీ ఉపాధ్యక్షుడైన బిడెన్.. ఆగస్టు 20 న విస్కాన్ సిన్ లో డెమొక్రాట్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.