నేనే అధ్యక్షుడినైతే..అలా చేయను, జో బిడెన్

| Edited By: Pardhasaradhi Peri

Aug 30, 2020 | 4:03 PM

తాను ఈ దేశాధ్యక్షుడినైతే సైన్యాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించబోనని అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ అన్నారు. తన ప్రైవేట్ మిలిటరీగా..

నేనే అధ్యక్షుడినైతే..అలా చేయను, జో బిడెన్
Follow us on

తాను ఈ దేశాధ్యక్షుడినైతే సైన్యాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించబోనని అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ అన్నారు. తన ప్రైవేట్ మిలిటరీగా వారిని వినియోగించుకునే ప్రసక్తే ఉండదని ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అమెరికా దళాలను తన వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి, శాంతియుతంగా నిరసన నిర్వహించడానికి తమకు గల హక్కుల కోసం పోరాడుతున్నవారిపై ఉసి గొల్పడానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అసలిది చట్టమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

నేషనల్ గార్డ్స్ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ జనరల్ కాన్ఫరెన్స్ లో గార్డులను ఉద్దేశించి బిడెన్ వర్చ్యువల్ గా ప్రసంగించారు. ట్రంప్ ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయిన పక్షంలో వైట్ హౌస్ ను వీడడానికి నిరాకరించినప్పుడు ఆయనను బలవంతంగా బయటకు తరలించేందుకు సైన్యమే అవసరమవుతుందని జో బిడెన్ పేర్కొన్నారు. అసలు ప్రజలకు, సైన్యానికి మధ్య వేరుగా విభజన రేఖ వంటిది ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Video Credits: Daily Mail UK