“రేపు భారతి సీఎం అయి రాజధాని ఒప్పందం కుదరదంటే..”

| Edited By: Pardhasaradhi Peri

Jan 15, 2020 | 4:18 PM

అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు 29వ రోజుకు చేరుకున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేడు ఉపవాసం చేస్తూ రైతులు తమ నిరసనను తెలుపుతున్నారు. టీడీపీ అధినేత కుటుంబంతో కలిసి రైతుల దీక్షా శిబిరాలకు వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు. ఇక మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన వెంటనే విశాఖకు రాజధాని […]

రేపు భారతి సీఎం అయి రాజధాని ఒప్పందం కుదరదంటే..
Follow us on

అమరావతి ప్రాంత రైతుల ఆందోళనలు 29వ రోజుకు చేరుకున్నాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేడు ఉపవాసం చేస్తూ రైతులు తమ నిరసనను తెలుపుతున్నారు. టీడీపీ అధినేత కుటుంబంతో కలిసి రైతుల దీక్షా శిబిరాలకు వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించారు. ఇక మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు తన మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్‌పై సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన వెంటనే విశాఖకు రాజధాని తరలించాలని ఫిక్స్ అయ్యారని ఆరోపించారు. ఇది కేవలం అమరావతి చుట్టపక్కల ఉన్న 29 గ్రామాల సమస్య మాత్రమే కాదని, యావత్తు రాష్ట్ర ప్రజలు అందరిది అని పేర్కొన్నారు. ఒక కులంపై ద్వేషంతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్నారు. జగన్‌ సీఎం అయిన 7 నెలల నుంచి విజయసాయి రెడ్డి కాలు కిందపెట్టకుండా ఢిల్లీ, వైజాగ్‌లకు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు.

జగన్ సర్కార్ పనితీరు వల్ల చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు అన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. ఇక మరో ఏడాదిలో వైఎస్ భారతి సీఎం కావొచ్చంటూ ఉదహరించారు జేసీ. జగన్ ఈ రోజు సీఎం అయి రాజధాని అమరావతి కాదంటున్నారు, రేపు భారతి కూడా సీఎం అయ్యి గత ఒప్పందం చెల్లదంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. ఇప్పటికే ప్రజల్లో జగన్ విశ్వాసాన్ని కోల్పోయారని, ప్రజంలందరూ ఇంకా బలంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలిపాలని కోరారు జేసీ. మహిళలపై దాడులు దారుణమని, ఈ నెల 23న జేఏసీ సమావేశమై తదుపరి కార్యాచరణను రూపొందిస్తుందని తెలిపారు. చంద్రబాబు శాంతిమార్గంలో పయనిస్తున్నారని, అన్నిసార్లు అది కరెక్ట్ కాదని హితవు పలికారు.