కుక్క అనుకుంటే నక్క అయ్యింది..!

|

May 15, 2020 | 6:23 PM

దారి తప్పిన జంతు పిల్లను చేరదీశాడు. అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. కుక్కపిల్ల అనుకుని ఇంటికి తెచ్చుకున్న వ్యక్తికి అది నక్క పిల్ల అని తేలడంతో విస్తుపోయాడు. జపాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. జపాన్ కి చెందిన మార్సీ.కామ్‌ అనే ట్విటర్‌ యూజర్‌కు కొద్దిరోజుల క్రితం రోడ్డుపక్కన ఓ జంతువు పిల్ల కనిపించింది. అది కుక్కపిల్లగా భావించిన అతడు దాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. పిల్లను ఏలాగైనా దాని యాజమానితో కలపాలని భావించాడు. […]

కుక్క అనుకుంటే నక్క అయ్యింది..!
Follow us on

దారి తప్పిన జంతు పిల్లను చేరదీశాడు. అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. కుక్కపిల్ల అనుకుని ఇంటికి తెచ్చుకున్న వ్యక్తికి అది నక్క పిల్ల అని తేలడంతో విస్తుపోయాడు. జపాన్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జపాన్ కి చెందిన మార్సీ.కామ్‌ అనే ట్విటర్‌ యూజర్‌కు కొద్దిరోజుల క్రితం రోడ్డుపక్కన ఓ జంతువు పిల్ల కనిపించింది. అది కుక్కపిల్లగా భావించిన అతడు దాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. పిల్లను ఏలాగైనా దాని యాజమానితో కలపాలని భావించాడు. ఇందు కోసం సోషల్ మీడియా ట్విటర్‌ ద్వారా దాని యాజమాని ఎవరికైనా తెలిస్తే చెప్పాలంటూ పోస్ట్ చేశాడు. యాజమాని వద్దకు చేర్చడానికి సహకరించాలంటూ ప్రార్థించాడు. అయితే దీనిపై స్పందించిన ఓ నెటిజన్‌ అది కుక్కపిల్లకాదు, నక్కపిల్ల అని.. దాన్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే వదిలేయాలంటూ సూచించాడు.

దీంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి వెంటనే దగ్గరలోని జంతు వైద్యుడికి చూపించాడు. ఆ పిల్లను పరీక్షించిన ఆ వైద్యుడు అది కుక్కపిల్ల కాదని, అడవి నక్కపిల్ల అని తేల్చాడు. ఇక చేసేదేమీ లేక దాన్ని అభయారణ్యంలో వదిలేశాడు మార్సీ.కామ్‌ ట్విటర్‌ యూజర్