ఇరుకు గదిలో అల్లాడిపోయిన 164 కుక్కలకు విముక్తి

| Edited By: Anil kumar poka

Nov 06, 2020 | 12:26 PM

ఆకలితో, అనారోగ్యంతో అల్లాడిపోతున్న మూగజీవాలను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది.. వాటిని చేరదీసి పెంచుకోవాలని అనిపిస్తుంది.. జపాన్‌లోని ఇజుమోలో అనే పట్టణంలో ఉన్న కుటుంబానికి కూడా ఇదే అనిపించింది.

ఇరుకు గదిలో  అల్లాడిపోయిన 164 కుక్కలకు విముక్తి
Follow us on

ఆకలితో, అనారోగ్యంతో అల్లాడిపోతున్న మూగజీవాలను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది.. వాటిని చేరదీసి పెంచుకోవాలని అనిపిస్తుంది.. జపాన్‌లోని ఇజుమోలో అనే పట్టణంలో ఉన్న కుటుంబానికి కూడా ఇదే అనిపించింది. కాకపోతే వారు సాధ్యాసాధ్యాలను పట్టించుకోలేదు.. అనారోగ్యంతో ఉన్న కుక్కలను చేరదీసి వాటి ఆలనాపాలనా చూసుకోసాగింది.. అలా 164 కుక్కలను ఇంటికి తెచ్చారు.. అన్నేసి కుక్కలను తెచ్చుకోడానికి వారిదేం పెద్ద లోగిలి కాదు.. ఇరుకైన ఇల్లు.. తిప్పికొడితే 323 చదరపు అడుగులు ఉంటుందంతే! పైగా ఆ ఇంట్లోనే ముగ్గురు ఉండాలి.. ఆ ఇరుకు ఇంట్లో కుక్కలు అల్లాడిపోయాయి.. బయటకు వెళ్లలేక… ఉన్నచోట స్వేచ్ఛగా తిరగడం రాక నానా అవస్థలు పడ్డాయి.. చెక్క అరల్లో కొన్ని, టేబుళ్ల కింద కొన్ని, కుర్చీల మీద కొన్ని, వాటి కింద కొన్ని.. తలదాచుకున్నాయి.. ఇంత దయనీయంగా బతుకేస్తున్న కుక్కలను చూసి ఇరుగుపొరుగువారికి జాలేసింది.. వారు వెంటనే పబ్లిక్‌ హెల్త్‌ అధికారులకు విషయం తెలిపారు.. వారు వెంటనే అక్కడికి వచ్చారు.. కుక్కల పరిస్థితి చూసి చలించిపోయారు.. కుక్కలను పెంచుకుంటున్న కుటుంబంతో మాట్లాడారు.. వాటికి అవసరమైన చికిత్సను అందించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. ఏడేళ్ల కిందట కూడా పక్కింటి వాళ్లు అధికారులకు ఈ రకమైన కంప్లయింటే చేశారు.. అయితే అప్పుడు చర్యలు తీసుకోకుండా అధికారులను అడ్డుకున్నారు కుటుంబసభ్యులు..