దాదాపు మూడు నెలలుగా అదృశ్యమైన అలీబాబా సంస్థ చీఫ్ జాక్ మా తొలిసారిగా కనబడ్డారు, కోవిడ్ కారణంగానే మిస్సింగ్ ?

| Edited By: Pardhasaradhi Peri

Jan 20, 2021 | 4:35 PM

గత నవంబరు నుంచి కనిపించకుండా పోయిన అలీబాబా గ్రూప్ చీఫ్ జాక్ మా ఇన్నాళ్లకు కనబడ్డారు.  ఇన్ని నెలలూ తాను కనిపించకపోవడానికి..

దాదాపు మూడు నెలలుగా అదృశ్యమైన  అలీబాబా  సంస్థ చీఫ్ జాక్ మా  తొలిసారిగా కనబడ్డారు, కోవిడ్ కారణంగానే మిస్సింగ్ ?
Follow us on

గత నవంబరు నుంచి కనిపించకుండా పోయిన అలీబాబా గ్రూప్ చీఫ్ జాక్ మా ఇన్నాళ్లకు కనబడ్డారు.  ఇన్ని నెలలూ తాను కనిపించకపోవడానికి కారణమేదీ లేదని, కొన్ని వివాదాల వల్లే నేను అజ్ఞాతంలో ఉన్నానని ఆయన తెలిపారు. అయితే బహుశా కోవిడ్ 19 కారణంగా ఆయన మిస్సింగ్ అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. చైనాలో అధ్యక్షుని విధానాలపై నేరుగా గళమెత్తిన ఈయన అదృశ్యం మిస్టరీగా మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణతకు ఈ ప్రభుత్వ అపసవ్య విధానాలే కారణమని ఆయన దుయ్యబడుతూ వచ్చారు . ఎక్కడో అజ్ఞాతంలో అస్వస్థత కోసం ఈయన చికిత్స తీసుకుని ఉండవచ్చునని, లేదా అసలు ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఉండవచ్చునని ..ఇలా రకరకాలుగా ఊహాగానాలు, వదంతులు పుట్టుకొచ్చాయి.

జాక్ మా ఆధ్వర్యంలోని యాంట్ గ్రూప్ కంపెనీ హోల్డింగ్ ఆన్ లైన్ ఫైనాన్స్ వ్యవహారాలపై బీజింగ్ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. చైనీస్ రెగ్యులేటర్లు యాంట్ సంస్థకు సంబంధించిన 35 బిలియన్ డాలర్ల లావాదేవీలపై దర్యాప్తు జరుపుతున్నాయి. కాగా సాధారణంగా దక్షిణ హైనాన్ లోని శాన్యాలో తన అధికారిక కార్యకలాపాలు కొనసాగుతాయని, అయితే ఈ ఏడాది కోవిద్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్  ద్వారా వీటిని నిర్వహిస్తున్నానని జాక్ మా చెప్పాడు.

Also Read:

West Bengal Politics Heat : ఎన్నికలు సమీపిస్తున్నవేళ బెంగాల్ లో పొలిటికల్ హీట్, టీఎంసీ ఆఫీస్ పై దాడి, ఇద్దరు మృతి

Minissha Lamba: బంధం బలంగా లేకుంటే విడిపోవడం మంచిది.. అది పెద్ద నేరమేమి కాదంటున్న ప్రముఖ నటి..

హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం.. జల్‌పల్లి కార్గో రోడ్డులో సంచరిస్తున్నట్లు అనుమానాలు..