న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఘన విజయం

| Edited By: Anil kumar poka

Oct 17, 2020 | 5:02 PM

న్యూజిలాండ్ లో శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని జసిండా  ఆర్డెన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కోవిడ్-19 పై పోరులో జసిండా ప్రభుత్వం తిరుగులేని 'విజయం' సాధించడం..

న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జసిండా ఘన విజయం
Follow us on

న్యూజిలాండ్ లో శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని జసిండా  ఆర్డెన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కోవిడ్-19 పై పోరులో జసిండా ప్రభుత్వం తిరుగులేని ‘విజయం’ సాధించడం ఈమెకు సునాయాస గెలుపును తెచ్చిపెట్టింది. మూడింట రెండు వంతుల ఓట్ల లెక్కింపులో లేబర్ పార్టీ 49.2 శాతం ఓట్లను చేజిక్కించుకోగలిగింది. 120 మంది సభ్యులతో కూడిన పార్లమెంటులో ఈ పార్టీకి సుమారు 64 సీట్లు కైవసమైనట్టే ! ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కానప్పటికీ, ఓటమి తమదేనని ప్రతిపక్ష నేత జుడిత్ కొలిన్స్ అంగీకరించారు. ఫోన్ ద్వారా జసిండా ను అభినందిస్తూ… తాము ఓడిపోయినట్టేనన్నారు. జుడిత్ ఆధ్వర్యంలోని కన్సర్వేటివ్ నేషనలిస్ట్ పార్టీ దాదాపు 35 స్థానాలను మాత్రం దక్కించుకోవచ్చు. అటు-ఈ  ఓటింగ్ సరళిని జసిండా  ఆర్డెన్..’ది కోవిడ్ ఎలక్షన్’ గా అభివర్ణించారు.