అమెరికా ఏకాకిగా మిగిలిపోయింది, ఇరాన్ సెటైర్

| Edited By: Pardhasaradhi Peri

Aug 15, 2020 | 4:49 PM

75 ఏళ్ళ ఐరాస చరిత్రలో అమెరికా ఏకాకిగా మిగిలిపోయిందని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఇరాన్ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసావీ పేర్కొన్నారు. మా దేశాన్ని అణచివేయాలని చూసిన అమెరికా పూర్తిగ్గా విఫలమైందని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీ అన్నారు. ఇరాన్ పై ఆయుధ ఆంక్షలను పొడిగించాలన్న అమెరికాతీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తిరస్కరించింది. ఇద్దరు మాత్రమే దీనికి అనుకూలంగా ఓటు చేయగా మిగిలినవారంతా వ్యతిరేకించారు. ఇది మా విజయం అని ఇరాన్ ప్రెసిడెంట్ […]

అమెరికా ఏకాకిగా మిగిలిపోయింది, ఇరాన్ సెటైర్
Follow us on

75 ఏళ్ళ ఐరాస చరిత్రలో అమెరికా ఏకాకిగా మిగిలిపోయిందని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఇరాన్ అధికార ప్రతినిధి అబ్బాస్ మౌసావీ పేర్కొన్నారు. మా దేశాన్ని అణచివేయాలని చూసిన అమెరికా పూర్తిగ్గా విఫలమైందని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీ అన్నారు. ఇరాన్ పై ఆయుధ ఆంక్షలను పొడిగించాలన్న అమెరికాతీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తిరస్కరించింది. ఇద్దరు మాత్రమే దీనికి అనుకూలంగా ఓటు చేయగా మిగిలినవారంతా వ్యతిరేకించారు. ఇది మా విజయం అని ఇరాన్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. 2015 నాటి ఒప్పందం సగమే ‘జీవించి ఉందని’ హాసన్ సెటైర్ వేశారు. మిగతా డీల్ అంతా చేవలుడిగిపోయిందన్నారు. ఇరాన్ నుంచి  ఆయిల్ నింపుకుని  వెనిజులా వెళ్తున్న భారీ నౌకలను అమెరికా సీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇరాన్, వెనిజులా దేశాలపై ఒత్తిడిని పెంచేందుకే అమెరికా ఈ చర్య తీసుకుంది.పైగా ఇరాన్ మీద ఆయుధ ఆంక్షలను పొడిగిస్తూ ఓ తీర్మానాన్ని కూడా తెచ్చింది.