ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందిస్తే తప్పేమిటి? : ఇమ్రాన్‌ తాహిర్‌

|

Oct 15, 2020 | 2:47 PM

క్రికెట్‌లో ఫైనల్‌ ఎలెవన్‌లో చోటు దక్కకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతారు కొందరు ఆటగాళ్లు.. ఇక ఆటగాళ్లకు డ్రింక్స్‌ ఇవ్వడాన్ని నామోషీగా ఫీలవుతారు.. చాలా తక్కువ మంది మాత్రమే ఆటలో అది కూడా భాగమనుకుంటారు.. అలాంటి వాడే ఇమ్రాన్‌ తాహిర్‌.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ లెగ్‌ స్పిన్నర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. పాపం అతడికి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.. లాస్టియర్‌ టీ-20 టోర్నమెంట్‌లో పర్పుల్‌ క్యాప్‌ను […]

ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందిస్తే తప్పేమిటి? : ఇమ్రాన్‌ తాహిర్‌
Follow us on

క్రికెట్‌లో ఫైనల్‌ ఎలెవన్‌లో చోటు దక్కకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీలవుతారు కొందరు ఆటగాళ్లు.. ఇక ఆటగాళ్లకు డ్రింక్స్‌ ఇవ్వడాన్ని నామోషీగా ఫీలవుతారు.. చాలా తక్కువ మంది మాత్రమే ఆటలో అది కూడా భాగమనుకుంటారు.. అలాంటి వాడే ఇమ్రాన్‌ తాహిర్‌.. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ లెగ్‌ స్పిన్నర్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.. పాపం అతడికి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.. లాస్టియర్‌ టీ-20 టోర్నమెంట్‌లో పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న అతడిని డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితం చేయడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారు.. తాహిర్‌తో డ్రింక్స్‌ ఇప్పించడమేమిటంటూ తిట్టిపోస్తున్నారు కొందరు.. అయితే దీనిపై తాహిర్‌ స్పందించాడు.. మైదానంలో ఉన్న ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించడాన్ని నామోషీగా ఫీలవడం లేదనీ, తాను మైదానంలో ఉన్నప్పుడు చాలా మంది తనకు డ్రింక్స్‌ అందించారని ట్విటర్‌లో తెలిపాడు.. అప్పుడు తనకు డ్రింక్స్‌ ఇచ్చిన వారికి ఇప్పుడు తాను అందిస్తున్నానని, అందులో తప్పేముందని ట్వీట్‌ చేశాడు. టీమ్‌ మెంబర్‌గా డ్రింక్స్‌ అందివ్వడం కూడా ఓ పనేనని చెప్పుకొచ్చాడు తాహిర్‌. ఇప్పుడు తాను ఆడుతున్నానా లేదా అన్నది ముఖ్యం కాదని, తాను జట్టు కోసం పని చేస్తున్నానా లేదా అన్నదే ముఖ్యమని అన్నాడు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఆడతానని, తాను ఆడటం కన్నా జట్టు విజయం సాధించడమే తనకు ముఖ్యమని వినమ్రంగా తెలిపాడు. ఇమ్రాన్‌ తాహిర్‌ పోస్టుపై క్రికెట్‌ అభిమానులు ఫిదా అయ్యారు.. నిజమైన ఆటగాడంటే తాహిరేనని కొనియాడుతున్నారు..