సౌత్ చైనా సీ కి భారత యుధ్ధ నౌక తరలింపు, డ్రాగన్ కంట్రీ ఆగ్రహం

| Edited By: Pardhasaradhi Peri

Aug 30, 2020 | 5:38 PM

సౌత్ చైనా సీ కి భారత్ తన యుధ్ధ నౌకను తరలించింది. ఉద్రిక్తతల నివారణకు రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తమకు సమ్మతం కాదని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సముద్ర ప్రాంతంలో..

సౌత్ చైనా సీ కి భారత యుధ్ధ నౌక తరలింపు, డ్రాగన్ కంట్రీ ఆగ్రహం
Follow us on

సౌత్ చైనా సీ కి భారత్ తన యుధ్ధ నౌకను తరలించింది. ఉద్రిక్తతల నివారణకు రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తమకు సమ్మతం కాదని చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సముద్ర ప్రాంతంలో ఇండియన్ నేవీ షిప్స్ ఉనికిని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2009 నుంచి ఇక్కడ ఆ దేశం కృత్రిమ ద్వీపాలను నిర్మించడం, సైన్యాన్ని మోహరించడంలో ‘బిజీ’ గా ఉంది. జూన్ 15 న గాల్వన్ లోయలో చైనా ఆక్రమణ, 20మంది భారత సైనికులు మరణించిన అనంతరం తాజాగా సౌత్ చైనా సముద్రంలోకి ఇండియన్ నేవీ యుధ్ధ నౌకను తరలించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సముద్ర జలాల్లో చాలాభాగం తమదేనని  పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా అంటోంది. ఇక్కడ ఇతర నౌకల ఉనికిని ఆ  దేశం సహించడం లేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదే సౌత్ చైనా సీలో అమెరికా కూడా తన యుధ్ధ నౌకలను మోహరించి ఉంచింది. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ సైతం ఇక్కడ చైనా అధిపత్యానికి చెక్ చెప్పాలని  యోచిస్తున్నారు.