జోబైడెన్ డిజిటల్ టీమ్ లో ‘ఇండియా వాసి’ ఐషా షా, శ్వేత సౌధం స్టాఫ్ లో అందర్నీ భారతీయులతో నింపేస్తున్నారుగా !

| Edited By: Pardhasaradhi Peri

Dec 29, 2020 | 11:35 AM

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ వైట్ హౌస్ స్టాఫ్ లో దాదాపు అందర్నీ భారతీయులతో నింపేస్తున్నారు. తాజాగా ఈ శ్వేత సౌధం లోని డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో ..

జోబైడెన్ డిజిటల్ టీమ్ లో ఇండియా వాసి ఐషా షా, శ్వేత సౌధం స్టాఫ్  లో అందర్నీ భారతీయులతో నింపేస్తున్నారుగా !
Follow us on

అమెరికా అధ్యక్షుడు కానున్న జో బైడెన్ వైట్ హౌస్ స్టాఫ్ లో దాదాపు అందర్నీ భారతీయులతో నింపేస్తున్నారు. తాజాగా ఈ శ్వేత సౌధం లోని డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో ..ఐషా షా అనే యువతికి ఆయన సీనియర్ పదవిని ఇచ్చారు. కాశ్మీర్ లో పుట్టిన ఈమె ఇక వైట్ హౌస్ లో పార్ట్ నర్స్ షిప్ మేనేజర్ పదవిని చేబట్టనుంది. డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ రాబ్ ఫ్లా హెర్టీ నాయకత్వం కింద పని చేయనుంది. లూసియానాలో పెరిగిన ఐషా షా.. ఇటీవలి వరకు బైడెన్-హారిస్ ప్రచార వర్గంలో డిజిటల్ పార్ట్ నర్స్ షిప్ మేనేజరుగా వ్యవహరించింది. అంతకుముందు జాన్ ఎఫ్ కెన్నడీకి  చెందిన కార్పొరేట్ ఫండ్ అసిస్టెంట్ మేనేజరుగా పని చేసింది. ఇంకా డిజిటల్ స్ట్రాటజీ విభాగంలో సుమారు 11 మంది సిబ్బంది ఉన్నారు.

వీరంతా తమతమ రంగాల్లో అత్యంత ప్రతిభ గలవారని, వైట్ హౌస్ ను అమెరికన్లకు కనెక్ట్ చేయడంలో తమవంతు పాత్ర పోషిస్తారని బైడెన్ చెప్పారు. అమెరికాను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి వీరి కృషి ఎంతో తోడ్పడుతుందని, మా టీమ్ లో వీరిని చేర్చుకోవడం  చాలా థ్రిల్లింగ్ గా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.ఇక ఐషా షా..తనను కొత్త పదవిలో నియమించినందుకు బైడెన్ కి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆమె చెప్పారు.