ఇమ్రాన్ ఖాన్ ని ఛాలెంజ్ చేస్తున్నా, మాజీ క్రికెటర్ మియాందాద్

| Edited By: Anil kumar poka

Aug 13, 2020 | 11:34 AM

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి  మాజీ క్రికెటర్ జావేద్  మియాందాద్ గట్టి సవాల్ విసిరాడు. రాజకీయాల్లో  ఆయనకు పోటీగా నిలబడతానని ప్రకటించాడు. తాను త్వరలో పాలిటిక్స్ లో చేరుతానని, ఇమ్రాన్ కి ఎదురునిలుస్తానని....

ఇమ్రాన్ ఖాన్ ని ఛాలెంజ్ చేస్తున్నా, మాజీ క్రికెటర్ మియాందాద్
Follow us on

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి  మాజీ క్రికెటర్ జావేద్  మియాందాద్ గట్టి సవాల్ విసిరాడు. రాజకీయాల్లో  ఆయనకు పోటీగా నిలబడతానని ప్రకటించాడు. తాను త్వరలో పాలిటిక్స్ లో చేరుతానని, ఇమ్రాన్ కి ఎదురునిలుస్తానని తన యూ ట్యూబ్ ఛానల్ లో పేర్కొన్నాడు. ఇమ్రాన్ కి తాను డ్రైవింగ్ ఫోర్స్ నని, ఒకప్పుడు ఆయన కూడా క్రికెటర్ అయినా తన తరువాతే అని చెప్పుకున్నాడు. అసలు నిజమైన రాజకీయాలంటే ప్రజలకు చెబుతాను.. క్రీడల్లోనే కాదు..పాలిటిక్స్ లో కూడా ఆయనకు నేనే కెప్టెన్ అన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తాను అని మియాందాద్ అన్నాడు. ఇమ్రాన్ ను నేనే ప్రధానిని చేశా.. పాకిస్థాన్ ని అయన సరిగా పాలించడంలేదు అని ఆరోపించిన మియాందాద్.. పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డులో విదేశీయులను తీసుకొచ్చి నియమించడం మేమిటని ప్రశ్నించాడు.

1992 ప్రాంతంలో వరల్డ్ కప్ విజేతల్లో ఒకడైన మియాందాద్.. ఎన్నో ఇన్నింగ్స్ ని తన చేత్తో గెలిపించాడు.