అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు: ఢిల్లీ పోలీసుల కేసుపై హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి. ఇంతకీ.. ఆయనేమన్నారో తెలుసుకుందాం పదండి....

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు: ఢిల్లీ పోలీసుల కేసుపై హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే 
Kothakota Srinivas Reddy
Follow us

|

Updated on: May 06, 2024 | 6:46 PM

పార్లమెంట్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మార్ఫింగ్‌ వీడియో సంచలనం సృష్టించింది. తెలంగాణ బీజేపీ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఐదుగుర్ని అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపారు. అయితే.. ఐదుగురు నిందితులకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. అటు.. అమిత్‌ షా వీడియో మార్పింగ్‌ చేసి.. వైరల్‌ చేయడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. కానీ.. ఆ లోపే.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేయడంతో ఢిల్లీ పోలీసులు షాక్‌ అయ్యారు. ఈ క్రమంలోనే.. అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో కీలక విషయాలు వెల్లడించారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి. అమిత్‌షా వీడియోను మార్ఫింగ్‌ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారని.. ఈ కేసులో వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఏప్రిల్‌ 27న ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేశామని.. ఇదే అంశంపై ఢిల్లీ పోలీసులు ఏప్రిల్‌ 28న కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే.. అంతకుముందే తాము నిందితులను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయాల్సిన పనిలేదన్నారు సీపీ శ్రీనివాస్‌రెడ్డి. వీడియో మార్ఫింగ్‌ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేస్తే కండీషనల్‌ బెయిల్‌పై బయటకొచ్చారు. ఈ కేసులో ఆల్‌రెడీ తాము సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నామని చెప్పారు హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి.

మొత్తంగా.. అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసు దర్యాప్తు విషయంలో హైదరాబాద్‌ పోలీసులు, ఢిల్లీ పోలీసుల మధ్య ఫైట్‌ నడిచింది. ఇలాంటి సమయంలో.. ఢిల్లీ పోలీసుల ఎంక్వైరీపై హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే