తుపాను ముప్పుతో నాసా వ్యోమగాముల రిటర్న్ కి బ్రేక్ !

| Edited By: Pardhasaradhi Peri

Aug 01, 2020 | 6:23 PM

హరికేన్ 'ఇసాయస్' ముప్పు కారణంగా నాసా వ్యోమగాములు... బాబ్ బెన్ కెన్, డగ్ హార్లే భూమికి చేరడంలో ఆలస్యం కావచ్చు.  గత మే 30 న వీరు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో రోదసియానం చేసిన సంగతి తెలిసిందే. వీరు ఆదివారం..

తుపాను ముప్పుతో నాసా వ్యోమగాముల రిటర్న్ కి బ్రేక్ !
Follow us on

హరికేన్ ‘ఇసాయస్’ ముప్పు కారణంగా నాసా వ్యోమగాములు… బాబ్ బెన్ కెన్, డగ్ హార్లే భూమికి చేరడంలో ఆలస్యం కావచ్చు.  గత మే 30 న వీరు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ లో రోదసియానం చేసిన సంగతి తెలిసిందే. వీరు ఆదివారం మధ్యాహ్నం ఫ్లోరిడా చేరుకోవాల్సి ఉంది. అయితే శుక్రవారం నుంచి బహమాస్ ను వణికిస్తున్న ఈ హరికేన్ ఫ్లోరిడా దిశగా కదులుతోందని నాసా పేర్కొంది. వ్యోమగాముల ‘అన్ డాకింగ్’ కి ఆరు గంటల ముందు ఇది బీభత్సం సృష్టించవచ్చునని అంచనా వేస్తున్నారు. వాతావరణాన్ని నియంత్రించలేమని, అందువల్ల తాము దిగడం ఆలస్యం కావచ్చునని ఎస్ట్రోనట్  బాబ్ బెన్ కెన్ అన్నారు. కాగా– ఇదే సందర్భంలో ఆయన తన ఆరేళ్ళ కొడుకు గురించి మాట్లాడాడు. అప్పుడప్పుడు తన కొడుకుతో వీడియో ఫోన్  ద్వారా తాను మాట్లాడుతుంటానని, వాడు చాలా మారిపోయాడని ఆయన చమత్కరించారు.