EPFO: 12శాతం కన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేయొచ్చా? పీఎఫ్ రూల్స్ ఏం చెబుతున్నాయ్?

|

Jul 01, 2024 | 3:31 PM

ప్రతి నెలా జీతం నుంచి కొంత భాగం దానికి కంట్రిబ్యూట్ అవుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వీటిని నిర్వహిస్తుంది. ఉద్యోగులు, వారి యజమానులు ఇద్దరూ చేసిన కంట్రిబ్యూషన్ ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. దీని వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వశాఖ ఏటా ప్రకటిస్తుంది. ఏడాదికి ఒకసారి వడ్డీ జమవుతుంది.

EPFO: 12శాతం కన్నా ఎక్కువ కంట్రిబ్యూట్ చేయొచ్చా? పీఎఫ్ రూల్స్ ఏం చెబుతున్నాయ్?
Epfo
Follow us on

మన దేశంలో ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఉంటుంది. ప్రతి నెలా జీతం నుంచి కొంత భాగం దానికి కంట్రిబ్యూట్ అవుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వీటిని నిర్వహిస్తుంది. ఉద్యోగులు, వారి యజమానులు ఇద్దరూ చేసిన కంట్రిబ్యూషన్ ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. దీని వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వశాఖ ఏటా ప్రకటిస్తుంది. ఏడాదికి ఒకసారి వడ్డీ జమవుతుంది. మే 13, 2024 నాటికి, 2023–2024 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.

ఎంత మొత్తం అంటే..

ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఉద్యోగి ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 12 శాతం వరకు ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయవచ్చు. అయితే నెలవారీ కనీస కంట్రిబ్యూషన్ రూ. 1,800 ఉంటుంది.

12% కంటే ఎక్కువగా ఇవ్వొచ్చా?

మీరు ఈపీఎఫ్ నకు స్వచ్ఛదంగా 12శాతం కన్నా ఎక్కువ మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేయొచ్చు.
ఉద్యోగి బేసిక్ శాలరీలో 12 శాతం కంటే ఎక్కువ విరాళం ఇవ్వవచ్చు. దీనిని స్వచ్ఛంద సహకారం(వలంటరీ కంట్రిబ్యూషన్) అని అంటారు. ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ప్రకారం, ఒక ఉద్యోగి తమ బేసిక్ శాలరీ, డీఏలో ఎక్కువ శాతం, తప్పనిసరి, వలంటరీ కంట్రిబ్యూషన్ లతో కలిపి మొత్తంగా నెలకు రూ. 15,000 వరకు అందించవచ్చు. ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26(6)లోని నిబంధనల ప్రకారం, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఏపీఎఫ్సీ) లేదా ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఆర్పీఎఫ్సీ) నుంచి అనుమతి పొందిన తర్వాత ఉద్యోగులు కూడా అధిక వేతనాల ఆధారంగా (అంటే రూ. 15,000 కంటే ఎక్కువ) విరాళాలు ఇవ్వవచ్చు.

యజమాని కంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుందా?

ఉద్యోగి మరింత కంట్రిబ్యూషన్ ఇవ్వడానికి ఎంచుకున్నప్పటికీ, యజమాని కంట్రిబ్యూషన్ మాత్రం 12 శాతానికి పరిమితం అవుతుంది.

ఈపీఎఫ్ ప్రయోజనాలు ఇవి..

ఈ పథకం రిటైర్ మెంట్ సమయానికి ఉద్దేశించిన దీర్ఘకాలక పథకం. దీనిలో కొంత సొమ్ము పింఛన్ కంట్రీబ్యూషన్ గా ఉంటుంది. మరికొంత సొమ్ము మొత్తం కార్పస్ లో యాడ్ అవుతుంది. ఇది పదవీవిరమణ సమయంలో మొత్తం సొమ్మును తీసుకోవచ్చు. అలాగే పెన్షన్ కంట్రిబ్యూషన్ కోసం ఉద్దేశించింది.. నెలనెలా పింఛన్ రూపంలో రిటైర్ అయిన తర్వాత తీసుకునే వీలుంటుంది. అలాగే ఈపీఎఫ్లో ఈఈఈ పన్ను విధానంలో పన్ను రహిత స్థితి సాధ్యవమతుంది. అంటే కొన్ని షరతులు పాటిస్తే, కంట్రిబ్యూషన్, సంపాదించిన వడ్డీ, ఉపసంహరణలు అన్నీ పన్ను నుంచి మినహాయింపు పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..