‘మీ హామీలు మరిచిపోలేదనుకుంటా’, ప్రధాని మోదీకి తేజస్వి యాదవ్ లేఖ

| Edited By: Pardhasaradhi Peri

Nov 03, 2020 | 4:54 PM

అయిదేళ్ల క్రితం బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నీటి బుడగలయ్యాయంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. నాడు మీరు ఎన్నో హామీలిచ్చారని, కానీ వాటిని మీరు మరిచిపోలేదనుకుంటా అని ఆయనకు వ్యంగ్యంగా  రాసిన  రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు.  దీన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2015 ఎన్నికల్లో మీరు బీహారీలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఇవి కొన్ని అంటూ..ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తామన్నారని, పాట్నా యూనివర్సిటీకి సెంట్రల్ స్టేటస్ కల్పిస్తామన్నారని తేజస్వి […]

మీ హామీలు మరిచిపోలేదనుకుంటా, ప్రధాని మోదీకి తేజస్వి యాదవ్ లేఖ
Follow us on

అయిదేళ్ల క్రితం బీహార్ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నీటి బుడగలయ్యాయంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. నాడు మీరు ఎన్నో హామీలిచ్చారని, కానీ వాటిని మీరు మరిచిపోలేదనుకుంటా అని ఆయనకు వ్యంగ్యంగా  రాసిన  రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు.  దీన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. 2015 ఎన్నికల్లో మీరు బీహారీలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఇవి కొన్ని అంటూ..ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తామన్నారని, పాట్నా యూనివర్సిటీకి సెంట్రల్ స్టేటస్ కల్పిస్తామన్నారని తేజస్వి గుర్తు చేశారు.  40 మంది ఎంపీలకు గాను ఈ రాష్ట్రం మీకు 39 మందిని ఇచ్చింది.. విదేశాల్లో ఉన్న ఎన్నారైల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు, కానీ తమ సొంత రాష్ట్రానికి వచ్చేందుకు వేల మైళ్ళ దూరం నడిచిన బీహారీ వలస కార్మికుల కోసం మీరు ఏం చేశారు అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు.