చైనా ప్రతీకారం, హాంకాంగ్ మీడియా అధిపతి అరెస్ట్

| Edited By: Anil kumar poka

Aug 10, 2020 | 10:02 AM

హాంకాంగ్ లో తమ వ్యతిరేకులపై చైనా ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. ఈ నగరాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి తాము తెచ్చిన కొత్త జాతీయ భద్రతా చట్టం కింద మీడియా అధిపతి జిమ్మీ లై ని చైనా అధికారులు అరెస్ట్ చేశారు.

చైనా ప్రతీకారం, హాంకాంగ్ మీడియా అధిపతి అరెస్ట్
Follow us on

హాంకాంగ్ లో తమ వ్యతిరేకులపై చైనా ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. ఈ నగరాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి తాము తెచ్చిన కొత్త జాతీయ భద్రతా చట్టం కింద మీడియా అధిపతి జిమ్మీ లై ని చైనా అధికారులు అరెస్ట్ చేశారు. విదేశీ శక్తులతో ఆయన కుమ్మక్కయ్యారని, తమ దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన చైనా..ఆయనను దేశద్రోహిగా అభివర్ణించింది. జిమ్మీని  చైనా పోలీసులు ఆయన ఇంటిలోనే అదుపులోకి తీసుకున్నారు. హాంకాంగ్ లో జిమ్మీ..యాపిల్ అనే డైలీని, ఓ మ్యాగజైన్ ని, రెండు టాబ్లాయిడ్లను నిర్వహిస్తున్నారు.

హాంకాంగ్ లో ప్రజాస్వామ్య అనుకూలురను ప్రోత్సహిస్తూ,, చైనాను బాహాటంగా విమర్శించడానికి ఏనాడూ వెనుకాడని ఈయనను హాంకాంగ్ వాసులు తమ ‘హీరో’గా ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ నగరంలో ప్రజాస్వామ్య అనుకూలుర ఆందోళనలకు జిమ్మీయే బాధ్యుడని చైనా ఆరోపిస్తోంది.

ఈ సెమి=అటానమస్ నగరంపై పట్టుకోసం బీజింగ్ తెచ్చిన చట్టం హాంకాంగ్ కి ‘మరణశాసనం’ అని జిమ్మీ దుయ్యబడుతూ వచ్చారు. ఈ చట్టాన్ని చైనా హాంకాంగ్ పై రుద్దడానికి రెండు వారాల ముందే. గత జూన్ లో మాట్లాడిన ఆయన….. చైనా ఎప్పుడు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా తాను సిధ్ధమేనని, తను ఎప్పుడూ చదవని పుస్తకాలను జైల్లో చదువుకుంటానని పేర్కొన్నారు. అంటే తన అరెస్టును జిమ్మీ ఏనాడో ఊహించారన్న విషయం అర్థమవుతోంది.