అమెరికా అధ్యక్షునిపై హాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు, జైల్లో అతడ్ని రేప్ చేయాలన్న యాక్ట్రెస్

| Edited By: Pardhasaradhi Peri

Dec 16, 2020 | 6:57 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ నటి డెబ్రా మెస్సింగ్ తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ట్రంప్..నువ్వు చాలా బలహీనుడివి, భయస్తుడివి..మూర్ఖుడివి, క్రిమినల్ వి..అంటూ ఇంకా ఇలాగే చాలా  తిట్టిపోసింది..

అమెరికా అధ్యక్షునిపై హాలీవుడ్ నటి వివాదాస్పద వ్యాఖ్యలు, జైల్లో అతడ్ని రేప్ చేయాలన్న యాక్ట్రెస్
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ నటి డెబ్రా మెస్సింగ్ తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ట్రంప్..నువ్వు చాలా బలహీనుడివి, భయస్తుడివి..మూర్ఖుడివి, క్రిమినల్ వి..అంటూ ఇంకా ఇలాగే చాలా  తిట్టిపోసింది. జైల్లో నువ్వు చాలాకాలం పాటు ఉంటావనుకుంటున్నా..ఖైదీలందరికీ చాలా పాపులర్ బాయ్ ఫ్రెండ్ అవుతావని భావిస్తున్నా..అని ఆమె పేర్కొంది. అయితే ఆ తరువాత ఈ ట్వీట్స్ ని ఆమె తొలగించింది. ఈమె వైఖరిపై అనేకమంది నెటిజన్లు మండిపడ్డారు. బహుశా ఈమె హోమోఫోబిక్ అయి ఉండవచ్చు అని కొందరు ఈసడించుకున్నారు. అయితే డెబ్రా మెస్సింగ్ మళ్ళీ ఓ వివరణ ఇస్తూ తను ఎల్ జీ బీటీ కమ్యూనిటీకి చెందినదానినని తెలిపింది. విల్ అండ్ గ్రేస్ మూవీలో నటించిన ఈ తార ఇలా ట్రంప్ మీద ఇంతెత్తున మండిపడడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

ఇక రేప్ అన్నది హింసకు సంబంధించిన చర్య అని, కోట్లాది ప్రజలపై ట్రంప్ హింసకు పాల్పడ్డాడని డెబ్రా పేర్కొంది. ఇప్పుడు ఆయనకు చుక్కెదురైందని, తానే బాధితుడయ్యాడని ఆమె అభిప్రాయపడింది. గత కొన్ని నెలలుగా ఈమె జో బైడెన్, హారిస్ టీమ్ కి మద్దతుగా ట్వీట్లు చేస్తూ వచ్చింది. ఓటింగ్ ఆవశ్యకతపై అవేర్ నెస్ ని వ్యాప్తి చెందింపజేసేందుకు ట్విటర్ ను వినియోగించుకుంటూ వచ్చింది.