Credit Score: మీ ‘సిబిల్’ తగ్గడానికి కారణాలు ఇవే.. పెరగాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..

|

Jul 24, 2024 | 1:57 PM

రుణాల ఈఎంఐలు సకాలంలో చెల్లించడం.. లేదా క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు సమయానికి చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగవుతుందని భావిస్తారు. అయితే అలా చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వారి క్రెడిట్ స్కోర్ పెరగదు. అలాంటి సమయాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బందులు పడతారు.

Credit Score: మీ ‘సిబిల్’ తగ్గడానికి కారణాలు ఇవే.. పెరగాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..
Credit Score
Follow us on

ఏవైనా కొత్త రుణాలు కావాలన్నా.. క్రెడిట్ కార్డులు మంజూరు కావాలన్నా.. క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ చాలా అవసరం. అది ఎంత మెరుగ్గా ఉంటే మీకు రుణాలు అంత సులభంగా, తక్కువ వడ్డీతో మంజూరవుతాయి. అయితే చాలా మందికి ఈ సిబిల్ స్కోర్ పై అవగాహన ఉండదు. ఒకవేళ అవగాహన ఉన్నా.. దానిని ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చో తెలీదు. సాధారణంగా ఇప్పటికే ఉన్న రుణాల ఈఎంఐలు సకాలంలో చెల్లించడం.. లేదా క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు సమయానికి చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్ మెరుగవుతుందని భావిస్తారు. అయితే అలా చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వారి క్రెడిట్ స్కోర్ పెరగదు. అలాంటి సమయాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బందులు పడతారు. బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తన కూడా క్రెడిట్ స్కోర్ ఎందుకు మెరుగుపరచడం లేదని ఆందోళన చెందుతారు. అలాంటి వారి కోసమే ఈ కీలక సమాచారం అందిస్తున్నాం. క్రెడిట్ స్కోర్ ప్రభావితం చేసే అంశాలేమిటి? ఈ కారణం ఎంత ప్రభావం చూపుతుంది? త్వరగా సిబిల్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్ స్కోర్ పెరగకపోవడానికి కారణాలు..

మీరు సమయానికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లిస్తున్నా.. క్రెడిట్ స్కోర్ పెరగకుండా ఉంది అంటే దానికి ఈ అంశాలు కారణాలు కావొచ్చు..

అధిక క్రెడిట్ వినియోగం.. మీ క్రెడిట్ కార్డులో అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం. ఉదాహరణకు మీరు మీ కార్డుపై రూ. 10,000 పరిమితిని కలిగి ఉండి.. మీరు రూ. 8,000 ఉపయోగిస్తే, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి 80 శాతం. అయితే క్రెడిట్ స్కోర్‌ బాగా ఉండాలంటే ఈ క్రెడిట్ వినియోగ నిష్పత్తి 30 శాతం కంటే తక్కువ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అధిక వినియోగ నిష్పత్తి క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుందని వివరిస్తున్నారు.

పరిమిత క్రెడిట్ మిక్స్.. క్రెడిట్ మిక్స్, లేదా క్రెడిట్ ఖాతాల వైవిధ్యం, క్రెడిట్ స్కోర్‌లో మరొక ముఖ్యమైన అంశం. గృహ రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డ్ వంటి వివిధ రకాల క్రెడిట్‌ల మిశ్రమాన్ని కలిగి ఉండటం రుణాన్ని నిర్వహించగల మీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. క్రెడిట్ వైవిధ్యం లేకపోవడం మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తుంది.

బహుళ క్రెడిట్ అప్లికేషన్లు.. తక్కువ వ్యవధిలో బహుళ క్రెడిట్ కార్డ్‌లు లేదా లోన్‌ల కోసం దరఖాస్తు చేయడం క్రెడిట్ స్కోర్‌లపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రతి చేసే ప్రతి దరఖాస్తుకు ఆ బ్యాంకు మీ ఆర్థిక స్థితిని తనిఖీ చేస్తుంది. ఇది హార్డ్ ఎంక్వైరీ అవుతుంది. ఇది స్కోర్‌ను తగ్గిస్తుంది.

క్రెడిట్ నివేదికలలో లోపాలు.. మీ క్రెడిట్ నివేదికను సమీక్షిస్తున్నప్పుడు, అది మీ గురించిన అంశాలను మాత్రమే కలిగి ఉందో లేదో తనిఖీ చేయండి. సరికాని లేదా అసంపూర్ణమైన సమాచారం కోసం తప్పకుండా చూడండి. వినియోగదారులు తమ క్రెడిట్ నివేదికలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, వారు కనుగొన్న ఏవైనా లోపాలను నివేదించడం చాలా ముఖ్యం.

ష్యూరిటీ సంతకాలు.. రుణంపై సహ సంతకం చేయడం కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించవచ్చు. మీరు రుణంపై సహ-సంతకం చేసినప్పుడు, ప్రాథమిక రుణగ్రహీత డిఫాల్ట్ అయినట్లయితే, మీరు రుణాన్ని చెల్లించే బాధ్యతను తీసుకుంటారు. ఇది మీ రుణ-ఆదాయ నిష్పత్తిని పెంచుతుంది. మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది.

మీ క్రెడిట్ స్కోర్‌ మెరుగవడానికి టిప్స్ ఇవి..

  • సకాలంలో బిల్లులు చెల్లించండి.
  • ఒకే రకమైన లోన్లు కాకుండా.. వైవిధ్యంగా మీ లోన్లు ఉండేలా వాటిని నిర్వహించండి.
  • క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని తగ్గించండి.
  • కొత్త లోన్ల కోసం వెంటవెంటనే దరఖాస్తులు చేయకండి.
  • లోపాలను సరిచేసుకోడానికి మీ క్రెడిట్ నివేదికను తనిఖీ చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..