బ్యాచిలర్లూ తస్మాత్ జాగ్రత్త! ఆ వ్యాధి ముప్పు అధికమేనట.. హెచ్చరిస్తున్న పరిశోధకులు..

|

Jan 10, 2021 | 5:30 PM

Heart Stroke Chances: ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు 'పెళ్లంటే నూరేళ్ల మంట' అని అభిప్రాయపడుతుంటారు. ఈ క్రమంలోనే తమ పెళ్లిని..

బ్యాచిలర్లూ తస్మాత్ జాగ్రత్త! ఆ వ్యాధి ముప్పు అధికమేనట.. హెచ్చరిస్తున్న పరిశోధకులు..
Follow us on

Heart Stroke Chances: ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు ‘పెళ్లంటే నూరేళ్ల మంట’ అని అభిప్రాయపడుతుంటారు. ఈ క్రమంలోనే తమ పెళ్లిని వాయిదా వేసుకుంటూపోతూ బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అలాంటి బ్యాచిలర్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. సరైన సమయంలో జరగాల్సిన పెళ్లి ముచ్చట జరగకపోతే గుండెకు ప్రమాదమంటున్నారు పరిశోధకులు.

బ్రిటన్‌లోని పలువురు పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పెళ్లికానివారి కంటే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని వాళ్లు చెబుతున్నారు. సుమారు 10 లక్షల మంది అవివాహితులు, వారి ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసిన బ్రిటన్ పరిశోధకులు.. వారంతా బ్లడ్ ప్రెజర్, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా బ్యాచిలర్స్ కంటే వివాహితులు 16 శాతం ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతుకుతున్నట్లు తేల్చి చెప్పారు.

Also Read: ‘క్రాక్’ మూవీ రివ్యూ.. షూర్ షాట్.. నో డౌట్.. బాక్స్‌ ఆఫీస్ బద్దలే..