హత్రాస్ కేసు, యూపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెంగాల్ సీఎం దీదీ భారీ ర్యాలీ

| Edited By: Pardhasaradhi Peri

Oct 03, 2020 | 2:57 PM

యూపీలోని హత్రాస్ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ఉదాసీనతను నిరసిస్తూ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యాన శనివారం కోల్ కతా లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు..

హత్రాస్ కేసు, యూపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బెంగాల్ సీఎం దీదీ భారీ ర్యాలీ
Follow us on

యూపీలోని హత్రాస్ కేసులో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ఉదాసీనతను నిరసిస్తూ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యాన శనివారం కోల్ కతా లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు.ఈ పార్టీకి చెందిన నలుగురు నేతల ప్రతినిధి బృందాన్ని యూపీ పోలీసులు హత్రాస్ సరిహద్దుల్లో నిన్న అడ్డగించారు. వీరికి, టీఎంసీ నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో ఈ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ కిందపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనను మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణించారు. బాధితురాలి కుటంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలపట్ల యూపీ పోలీసుల దుశ్చర్యను ఆమె ఖండిస్తూ, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.