వ్యవసాయ బిల్లులపై అప్పుడే ఆందోళనలు, రేపు హర్యానాలో రైతుల నిరసన

| Edited By: Pardhasaradhi Peri

Sep 19, 2020 | 7:36 PM

వ్యవసాయ రంగ బిల్లులను ఉపసంహరించాలన్న తమ డిమాండును కేంద్రం నిరాకరించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ రేపు హర్యానాలోని..

వ్యవసాయ బిల్లులపై అప్పుడే ఆందోళనలు, రేపు హర్యానాలో రైతుల నిరసన
Follow us on

వ్యవసాయ రంగ బిల్లులను ఉపసంహరించాలన్న తమ డిమాండును కేంద్రం నిరాకరించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ రేపు హర్యానాలోని అన్ని జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు  నేషనల్ హైవేల్లో రాస్తారోకో ఆందోళన చేపట్టాలని రైతులను కోరింది. వ్యవసారంగ మూడు బిల్లులు ఆదివారం రాజ్యసభ ముందుకు రానున్నాయి. లోక్ సభ వీటిని ఆమోదించింది. అటు పంజాబ్ లో ఈ నెల 24 నుంచి 26 వరకు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను రైతులు చేపట్టనున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధమైన ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.