ఉద్దవ్‌ థాక్రే అంతటి అసమర్థ సీఎం ప్రపంచంలో ఉండరు

|

Sep 29, 2020 | 4:32 PM

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేపై మరోసారి ఘాటైన విమర్శలు చేశారు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని కంగనా ఫైరయ్యారు..

ఉద్దవ్‌ థాక్రే అంతటి అసమర్థ సీఎం ప్రపంచంలో ఉండరు
Follow us on

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేపై మరోసారి ఘాటైన విమర్శలు చేశారు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని కంగనా ఫైరయ్యారు.. హర్యానాకు చెందిన యూ ట్యూబర్‌ సాహిల్‌ చౌదరి అరెస్ట్‌ న్యూస్‌ క్లిప్పింగ్‌ను షేర్‌ చేస్తూ కంగనా ట్వీట్‌ చేశారు.. సాహిల్‌ చౌదరి అరెస్ట్‌ను ఆమె తప్పుపట్టారు. ఇంత అసమర్థుడైన ముఖ్యమంత్రిని ఆయన బృందాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే ఇలా అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. మన ఇల్లను పగలగొట్టి మనల్ని చంపడం తప్ప వాళ్లు మనకేం చేశారంటూ ప్రశ్నించారు కంగనా రనౌత్‌. దీనికి ఎవరు జవాబిస్తారని కాంగ్రెస్‌ను ట్యాగ్‌ చేస్తూ ఆమె ప్రశ్నలు కురిపించారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం పౌరుల ప్రజాస్వామిక హక్కని, సాహిల్‌ చౌదరి కూడా ఆ హక్కుతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని కంగనా అన్నారు. సాహిల్‌పై ఎవరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే దాన్ని పట్టుకుని ఆయనను జైలుకు పంపడం విచిత్రంగా ఉందన్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ దర్శకుడు అనురాగ్‌ కాశ్యప్‌పై నటి పాయల్‌ ఘోష్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినా ఆయనను మాత్రం ఏమీ అనడం లేదనీ, స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని కంగనా రనౌత్‌ అన్నారు.