ఏపీ ఎన్నికల కమిషనర్ మరో సంచలన నిర్ణయం.. దానికి గ్రీన్ సిగ్నల్

|

Mar 20, 2020 | 1:31 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం వెరసి సీఎం జగన్ తలపెట్టిన ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది

ఏపీ ఎన్నికల కమిషనర్ మరో సంచలన నిర్ణయం.. దానికి గ్రీన్ సిగ్నల్
Follow us on

SEC has given green signal to house sites distribution: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం వెరసి సీఎం జగన్ తలపెట్టిన ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఇక మిగిలింది నాలుగు రోజులే కాబట్టి.. ఆలోగా ఏర్పాట్లను చేసేయాల్సిందిగా ఆదేశాలు ఇప్పటికే జారీ అయినట్లు తెలుస్తోంది.

ఏపీలో లోకల్ ఎన్నికలను వాయిదా వేసిన స్టేట్ ఎలెక్షన్ కమిషనర్.. ఎన్నికల కోడ్‌ని మాత్రం అలాగే కొనసాగించారు. వాయిదానే చెల్లదన్న వాదనతోపాటు.. ఒకవేళ వాయిదా వేస్తే మరి ఎన్నికల కోడ్ కొనసాగించడంలో మతలబేంటన్న సందేహాలతో సుప్రీంకోర్టు కెక్కిన జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సానుకూల స్పందన పొందింది. ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ రమేశ్ కుమార్. బుధవారం మధ్యాహ్నం తీర్పు రాగా.. సాయంత్రానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేశారాయన.

ఈ ఆదేశాలతో ఉగాది నాడు నిర్వహించనున్న ఇళ్ళ పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయినట్లేనని వైసీపీ నేతలు చెప్పుకున్నా.. చివరికి స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా కొంత సస్పెన్స్ కొనసాగింది. తాజాగా శుక్రవారం హైదరాబాద్ నుంచి పనిచేయడం ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఇళ్ళ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. సుప్రీంకోర్టు పాత పథకాలను కొనసాగించవచ్చని మాత్రమే చెప్పింది. కొత్త పథకాలు వద్దని కూడా పేర్కొంది. అయితే ఇళ్ళ పట్టాల పంపిణీ గతంలోనే ప్రకటించారు కాబట్టి పాత పథకంగానే భావించాలంటూ జగన్ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌కు నివేదించింది. దాన్ని పరిశీలించిన రమేశ్ కుమార్… ఇళ్ళ పట్టాల పంపిణీకి ఆమోదం తెలిపారు.