డిజిటల్ ఇండియాకు రూ. 75 వేల కోట్లు ఇస్తాం… సుందర్ పిచాయ్

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 4:39 PM

ఇండియాలో డిజిటల్ ఎకానమీ వృద్దికి తాము తోడ్పడుతామని, ఇందుకు 75 వేల కోట్ల ఫండ్ ఇస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ప్రధాని మోదీ 'విజన్' కి సపోర్ట్ ఇస్తునందుకు తమకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్లు..

డిజిటల్ ఇండియాకు రూ. 75 వేల కోట్లు ఇస్తాం... సుందర్ పిచాయ్
Follow us on

ఇండియాలో డిజిటల్ ఎకానమీ వృద్దికి తాము తోడ్పడుతామని, ఇందుకు 75 వేల కోట్ల ఫండ్ ఇస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ప్రధాని మోదీ ‘విజన్’ కి సపోర్ట్ ఇస్తునందుకు తమకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్లు, టై అప్స్ ల ద్వారా రానున్న 5 నుంచి 7 ఏళ్ళలో ఈ నిధులను వినియోగించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘గూగుల్ ఫర్ ఇండియా’ ఈవెంట్ సందర్భంగా పిచాయ్ ఈ ప్రకటన చేశారు. మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్.పి. నిషాంక్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత భవిష్యత్తు, ఈ దేశ డిజిటల్ ఎకానమీపై తమ విశ్వాసానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. తదుపరి ఇన్నోవేషన్ కు భారత్ నేతృత్వం వహించాలని ఆయన కోరారు. అంతకు ముందు ప్రధాని మోదీ.. తమ ట్వీట్ లో..పిచాయ్ తో తాను ‘ఫలవంతమైన చర్చలు’ జరిపినట్టు తెలిపారు. విద్య తదితర రంగాల్లో గూగుల్ చేస్తున్న ప్రయత్నాలకు తానెంతో సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు. దేశ డిజిటల్ ఎకానమీ వృద్దికి తోడ్పడాలని సుందర్ పిచాయ్ ని కోరినట్టు ఆయన వెల్లడించారు.