ఇండిగో విమానంలో సీటు కింద పుత్తడి, దాచినా పట్టేసిన కస్టమ్స్ సిబ్బంది, ఎవరిదా పని ? దర్యాప్తు షురూ

| Edited By: uppula Raju

Dec 20, 2020 | 12:10 AM

దుబాయ్  నుంచి ఢిల్లీకి చేరిన ఇండిగో విమానంలో ఓ సీటు కింద దాచిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సకనుగొన్నారు. రూ. 49.9 లక్షల విలువైన 1.13 కేజీల ఈ బంగారం సిలిండ్రికల్ రాడ్స్ రూపంలో ఉంది. విమానంలోని సీటు..

ఇండిగో విమానంలో సీటు కింద పుత్తడి, దాచినా పట్టేసిన కస్టమ్స్ సిబ్బంది, ఎవరిదా పని ? దర్యాప్తు షురూ
Follow us on

దుబాయ్  నుంచి ఢిల్లీకి చేరిన ఇండిగో విమానంలో ఓ సీటు కింద దాచిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సకనుగొన్నారు. రూ. 49.9 లక్షల విలువైన 1.13 కేజీల ఈ బంగారం సిలిండ్రికల్ రాడ్స్ రూపంలో ఉంది. విమానంలోని సీటు ట్రాక్ గార్డ్స్ లో ఎవరికీ కనబడకుండా నేర్పుగా దీన్ని దాచారు. ఈ ప్లేన్ శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కస్టమ్స్ చట్టం కింద అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు దీన్ని ఇలా దాచారన్నది తెలియలేదు.  ఒక విమానంలో ని సీటు కిందా పుత్తడి దాచిన ఘటన ఇదే మొదటిదని అంటున్నారు. ఢిల్లీ కస్టమ్స్ అధికారులు దీనిపై దుబాయ్ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి దేశంలోకి  బంగారం దొంగ రవాణా ఘటనలు పెరిగిపోతున్నాయి.  అయితే ఎప్పటికప్పుడు కస్టమ్స్ అధికారుల నిఘా కారణంగా ఈ స్మగ్లింగ్ కి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు.