GHMC Elections 2020: పాతబస్తీలో పోలీసుల హై అలెర్ట్

|

Dec 01, 2020 | 2:12 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్‌ కొనసాగుతుంది. 590 సమసాయాత్మక, 387 అతి సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ వద్ద..

GHMC Elections 2020: పాతబస్తీలో పోలీసుల హై అలెర్ట్
Follow us on

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్‌ కొనసాగుతుంది. 590 సమసాయాత్మక, 387 అతి సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ వద్ద ఆదనపు బలగాలు మోహరించారు.

పోలింగ్‌ స్టేషన్ల వద్ద 70వేల సీసీ కెమెరా లతో నిఘా ఏర్పాటు చేశారు. స్పెషల్ ట్రాకింగ్ టీం, రూట్ మొబైల్ టీం ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు.

గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గత ఎన్నికల్లో పురాణాపూల్, శాలిబండ లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో పురాణాపూల్ లో రిపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. రీ పోలింగ్, క్రాస్ ఓటింగ్ జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.