ఆ చట్టానికి నిరసన.. జర్మన్ విద్యార్థికి ‘ బహిష్కరణ ‘

| Edited By: Anil kumar poka

Dec 25, 2019 | 10:05 AM

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు జర్మన్ విద్యార్థినొకరిని అతని స్వదేశానికి తిప్పిపంపేశారు. ఈ విద్యార్ధి పేరు జాకబ్ లింథేన్తాల్.. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ లో ఫిజిక్స్ పీజీ స్టూడెంట్.. పౌరసత్వ చట్టానికి నిరసనగా ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా చెన్నై ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలోనూ ఈ స్టూడెంట్ పాల్గొన్నాడు. ‘ 1933 – 1945… వుయ్ హావ్ బీన్ దేర్ ‘ అని రాసి ఉన్న ప్లకార్డును […]

ఆ చట్టానికి నిరసన.. జర్మన్ విద్యార్థికి  బహిష్కరణ
Follow us on

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు జర్మన్ విద్యార్థినొకరిని అతని స్వదేశానికి తిప్పిపంపేశారు. ఈ విద్యార్ధి పేరు జాకబ్ లింథేన్తాల్.. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ లో ఫిజిక్స్ పీజీ స్టూడెంట్.. పౌరసత్వ చట్టానికి నిరసనగా ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనకు సంఘీభావంగా చెన్నై ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలోనూ ఈ స్టూడెంట్ పాల్గొన్నాడు.

‘ 1933 – 1945… వుయ్ హావ్ బీన్ దేర్ ‘ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని ఆందోళన చేశాడు. అంతే ! ఇక నీ స్వదేశం జర్మనీకి వెళ్లాలంటూ అతడ్ని మౌఖికంగా ఆదేశించారు. చెన్నై లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు తనను ఈ మేరకు ఆదేశించారని జాకబ్ తెలిపాడు.’ ఈ నిరసన ప్రదర్శనల్లో పార్టిసిపేట్ చేయడం నీ వీసా రూల్స్ ని ఉల్లంఘించడమే.. అందుకే వెంటనే ఇండియా విడిచి వెళ్ళిపో ‘ అని అధికారులు అతనికి చెప్పారట.. అయితే ఇతడిని ఐఐటీ మద్రాస్ కార్యాలయం కోరిందా లేక కేంద్ర ప్రభుత్వమా అన్నది స్పష్టం కాలేదు. జాకబ్ జర్మనీలోని డ్రెస్ డెన్ ప్రాంతానికి చెందినవాడు. తమ తోటి విద్యార్థిని అతని స్వదేశానికి పంపివేయాలన్న నిర్ణయాన్ని తప్పు పట్టిన ఐఐటీ విద్యార్థులు.. ఇది సిగ్గుచేటని దుయ్యబట్టారు.(సోమవారం సాయంత్రం జాకబ్ ఆమ్ స్టర్ డామ్ వెళ్లే విమానం ఎక్కేశాడు).


ఈ విద్యార్థి విషయంలో అధికారులు పాటించిన విధానాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఆర్.పి. నిషాంక్ పేరును ట్యాగ్ చేస్తూ.. ‘ ఇది చాలా విచారకరమని ‘ ఆయన ట్వీట్ చేశారు. ఏ ప్రజాస్వామ్యం కూడా భావ ప్రకటనా స్వేఛ్చను అణచివేయజాలదని అన్నారు. జాకబ్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శశిథరూర్ కోరారు.