ఉచిత వ్యాక్సీన్ హామీ సక్రమమే, నిర్మలా సీతారామన్

| Edited By: Pardhasaradhi Peri

Oct 24, 2020 | 5:22 PM

బీహార్ ఎన్నికలను పురస్కరించుకుని ప్రజలకు తాము ఫ్రీ కోవిడ్  వ్యాక్సీన్ ఇస్తామన్న హామీ సక్రమమే అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రకటన సరైన ‘ఆర్డర్’ లోనే ఉందని, తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నదీ ఒక పార్టీ ప్రకటించవచ్చునని ఆమె అన్నారు. అయితే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ హామీపై ధ్వజమెత్తాయి. కరోనా వైరస్ పాండమిక్ ని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకుంటోందని, దీనిపై తగిన చర్య తీసుకోవాలని ఇవి […]

ఉచిత వ్యాక్సీన్ హామీ సక్రమమే, నిర్మలా సీతారామన్
Follow us on

బీహార్ ఎన్నికలను పురస్కరించుకుని ప్రజలకు తాము ఫ్రీ కోవిడ్  వ్యాక్సీన్ ఇస్తామన్న హామీ సక్రమమే అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రకటన సరైన ‘ఆర్డర్’ లోనే ఉందని, తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నదీ ఒక పార్టీ ప్రకటించవచ్చునని ఆమె అన్నారు. అయితే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ హామీపై ధ్వజమెత్తాయి. కరోనా వైరస్ పాండమిక్ ని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకుంటోందని, దీనిపై తగిన చర్య తీసుకోవాలని ఇవి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. కానీ-నిర్మలా సీతారామన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ పార్టీ మేనిఫెస్టోను పూర్తిగా  సమర్థించారు. ఆరోగ్యం అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమని, ఏ పార్టీ అయినా తాము పవర్ లోకి వస్తే ఏం చేస్తామో చెప్పే హక్కు ఆ పార్టీకి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.