‘మర్చిపోదాం’, ‘క్షమించేద్దాం’, అశోక్ గెహ్లాట్ ‘పిలుపు’ !

| Edited By: Pardhasaradhi Peri

Aug 12, 2020 | 1:13 PM

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య 'సయోధ్య' కుదరవచ్చా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానాన్ని..

మర్చిపోదాం, క్షమించేద్దాం, అశోక్ గెహ్లాట్ పిలుపు !
Follow us on

రాజస్తాన్ రాజకీయ సంక్షోభంలో సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య ‘సయోధ్య’ కుదరవచ్చా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో పార్టీ అధిష్టానాన్ని కలిసి సచిన్ మళ్ళీ జైపూర్ లో అడుగు పెట్టారు. ఆయన ప్రస్తావించిన డిమాండ్ల పరిశీలనకు ముగ్గురు సభ్యులతో ఓ పానెల్ కూడా ఏర్పాటైంది. నాయకత్వాన్ని మార్చాలన్న ఆయన డిమాండుపై పార్టీ అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. రాజీ ధోరణి పాటించాలని పరోక్షంగా సూచించినట్టు కనబడుతోంది. ఇక సీఎం గెహ్లాట్ జైసల్మీర్ వెళ్లి అక్కడి హోటల్లో ఉన్న తమవర్గం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సచిన్ పైలట్ తిరిగి రావడంపట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అది సహజమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ అంతా ఇలా జరగడంనిజంగానే వారికి ఆందోళన కలిగించింది. అయితే దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు  సేవలందించాల్సి ఉంది గనుక.. మనం సహనంతో ఉండాలని  వారికి నచ్ఛజెప్పాను అని ఆయనమీడియాకు తెలిపారు.

ప్రస్తుతానికి ‘ఫర్ గెట్’ (మర్చిపోదాం). ‘ఫర్ గివ్’ (క్షమించేద్దాం) అన్న పాలసీ బెటర్ అన్న తీరులో ఆయన మాట్లాడారు. రెబెల్ ఎమ్మెల్యేలను క్షమించేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే తాను వారిని ఆప్యాయంగా కౌగలించుకుని తిరిగి ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు. ఇక అశోక్ గెహ్లాట్ బల నిరూపణకు అసెంబ్లీ సెషన్ జరగడానికి రెండు రోజులు మాత్రమే ఉండడంతో  ఈ రాజస్తాన్ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.