Union Budget 2021: మరికొన్ని గంటల్లో సీతమ్మ ఆవిష్కరించనున్న ఆశల చిట్టా పై తెలుగు రాష్ట్రాలు ఆశలు

| Edited By: Ram Naramaneni

Feb 01, 2021 | 9:51 AM

కోవిడ్ వైరస్ సృష్టించిన కల్లోలానికి యావత్ భారత ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. ఉపాధి కోల్పోయి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజల ఆర్ధిక ఇబ్బందుల..

Union Budget 2021: మరికొన్ని గంటల్లో సీతమ్మ ఆవిష్కరించనున్న ఆశల చిట్టా పై తెలుగు రాష్ట్రాలు ఆశలు
Follow us on

Union Budget 2021: కోవిడ్ వైరస్ సృష్టించిన కల్లోలానికి యావత్ భారత ప్రజలు ఇబ్బందులు పడ్డారు.. ఉపాధి కోల్పోయి ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజల ఆర్ధిక ఇబ్బందులనుంచి.. దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి.. ప్రతికుల పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఓ మంచి సమయం చిక్కింది. అదే యావత్తు దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆశల పద్దు . ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌‌ను ఆవిష్కరిస్తారు. బడ్జెట్‌కు ముందు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. ఉదయం 10.15 నిమిషాలకు పార్లమెంటు భవనంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది.. అనంతరం బడ్జెట్‌ పార్లమెంటు ముందుకు వస్తుంది.. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్‌ ఇది.

మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను మళ్లీ పరుగులు పెట్టించడానికి కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందో ఇంకొన్ని గంటల్లో మనకు తెలియనుంది. ఈసారి బడ్జె్ట్‌పై చాలా మందిలో భారీ అంచనాలే ఉన్నాయి. రైతుల కోసం కేంద్రం కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇంకా పన్ను చెల్లింపుదారులకు, మహిళలకు, ఉద్యోగులకు కూడా ఊరట కలిగించే నిర్ణయాలు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కరోనా నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగానికి కేటాయింపులు పెరగొచ్చు.

సామన్యుడి నుంచి సంపన్నుల వరకు అందరూ బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్నడూ చూడనటువంటి బడ్జెట్‌ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు సామాన్యుడిలో ఆశలు మరింతగా పెంచుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని ఏడాది నుంచి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి తర్వాత వస్తున్న బడ్జెట్‌ కావడంతో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది . కరోనాతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం తీసుకునే చర్యలపై నర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక వ్యవసాయానికి నిధుల కేటాయింపు పెంచాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పన్ను శ్లాబ్‌ ఉండాలని సూచిస్తున్నారు. నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఉపాధి కల్పనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బడ్జెట్ పై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి.

బడ్డెట్ బ్యాక్ టూ బ్యాక్ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి: Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

Also Read: ఏపీ సీఎం జగన్ పేషీ ఉద్యోగినంటూ ఘరానా మోసం .. ఓ వ్యాపారికి కుచ్చుటోపీ