రాయపూర్ రోడ్లపై ‘జలకాలాడిన చేపలు’, ‘లూటీలకు’దిగిన స్థానికులు, గంట సేపు ‘ఫిష్ డ్రామా ‘ ,ఎక్కడంటే ?

| Edited By: Pardhasaradhi Peri

Jan 28, 2021 | 1:30 PM

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో చేపల లోడ్ తో వెళ్తున్న ఓ భారీ వాహనం హఠాత్తుగా బోల్తా కొట్టింది. దీంతో అందులోని చేపలన్నీ చెల్లాచెదురుగా రోడ్లపై..

రాయపూర్ రోడ్లపై జలకాలాడిన చేపలు, లూటీలకుదిగిన స్థానికులు, గంట సేపు ఫిష్ డ్రామా  ,ఎక్కడంటే ?
Follow us on

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో చేపల లోడ్ తో వెళ్తున్న ఓ భారీ వాహనం హఠాత్తుగా బోల్తా కొట్టింది. దీంతో అందులోని చేపలన్నీ చెల్లాచెదురుగా రోడ్లపై పడిపోయాయి. సదా బిజీగా ఉండే హాసౌద్ హైవేపై బుధవారం ఈ సంఘటన జరిగింది. రోడ్లపై లుకలుకలాడుతున్న చేపలను చూడగానే స్థానికులంతా గుంపులుగా  వచ్చి వాటిని సంచీలు, డబ్బాల్లో తీసుకుపోయారు. దీంతో సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంతా వీడియోకెక్కింది. చివరకు పోలీసులు అక్కడకి చేరుకొని స్థానికుల సాయంతో వాహనాన్ని తిరిగి యధాస్థానంలోకి తెచ్చారు.ఉసూరుమంటూ రోడ్లపై మిగిలి ఉన్న మత్స్యాలను మళ్ళీ ట్రక్కులో చేర్చారు. కానీ అప్పటికే సగం చేపలు మత్స్య ప్రియుల ఇళ్లకు చేరిపోయాయి.