కరోనాపై విజయం.. మొదటి ‘ప్లాస్మా థెరపీ’ సక్సెస్ : మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి

| Edited By:

Apr 29, 2020 | 7:18 PM

కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లక్షలమంది బలయ్యారు. కాగా.. భారత్ లో కోవిద్-19 సోకిన వ్యక్తికి చేసిన మొట్ట మొదటి ప్లాస్మా థెరపి విజయవంతం

కరోనాపై విజయం.. మొదటి ‘ప్లాస్మా థెరపీ’ సక్సెస్ : మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి
Follow us on

Plasma therapy: కోవిద్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. లక్షలమంది బలయ్యారు. కాగా.. భారత్ లో కోవిద్-19 సోకిన వ్యక్తికి చేసిన మొట్ట మొదటి ప్లాస్మా థెరపీ విజయవంతం అయ్యిందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే బుధవారం ప్రకటించారు. ‘‘ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో నిర్వహించిన మొట్ట మొదటి ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలో ఉన్న మరో వ్యక్తికి కూడా ఈ థెరపీ నిర్వహించబోతున్నాం. ఇది కూడా విజయవంతం అవుతుందని మా ప్రగాఢ విశ్వాసం’’ అని తోపే ట్వీట్ చేశారు.