‘ఆ ఇద్దరే బాధ్యులు, వారిపై కేసు పెట్టాలి’, అన్నదాత ఆగ్రహం, ఆత్మహత్యా యత్నం, ఆసుపత్రికి తరలింపు.

| Edited By: Pardhasaradhi Peri

Dec 21, 2020 | 5:34 PM

రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న వేలాది రైతుల్లో ఓ అన్నదాత సోమవారం ఆత్మహత్యా యత్నం చేశాడు. సింఘు బోర్డర్ లో విషం తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడు. పంజాబ్ లోని..

ఆ ఇద్దరే బాధ్యులు, వారిపై కేసు పెట్టాలి,  అన్నదాత ఆగ్రహం, ఆత్మహత్యా యత్నం, ఆసుపత్రికి తరలింపు.
Follow us on

Farmer Protest: రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న వేలాది రైతుల్లో ఓ అన్నదాత సోమవారం ఆత్మహత్యా యత్నం చేశాడు. సింఘు బోర్డర్ లో విషం తాగి అపస్మారక స్థితికి వెళ్ళాడు. పంజాబ్ లోని తరన్ తరన్ కి చెందిన ఈ 65 ఏళ్ళ అన్నదాత ఈ ఉదయమే ఈ బోర్డర్ చేరుకున్నాడు. నిరంజన్ సింగ్ అనే ఈ రైతును రోహ్తక్ లోని ఆసుపత్రికి తరలించారు. ఇతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. అన్నదాతల దయనీయ స్థితికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలే బాధ్యులని ఈయన ఆరోపించాడు. వారిపై కేసు పెట్టాలన్నాడు. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారకులైనవారిమీద  కేసు పెట్టరా అని నిరంజన్ సింగ్ ప్రశ్నించాడు. కాగా సింఘు బోర్డర్ నుంచి ఫిరోజ్ పూర్ కు తిరిగి వచ్చిన కుల్ బీర్ సింగ్, అనే రైతు, 22 ఏళ్ళ ఓ యువరైతు భటిండాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటివరకు 30 మంది రైతులు మృతి చెందినా కేంద్రానికి పట్టడంలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తమ ఆందోళన వెనుక ఏ రాజకీయ పార్టీ కూడా లేదని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.  ..విపక్షాలే  తమను రెచ్చగొడుతున్నాయని ప్రధాని, బీజేపీ నేతలు చేసిన ఆరోపణను ఈ యూనియన్లు ఖండిస్తున్నాయి.