మీకు ఏం కావాలో చెప్పండి, మా ప్రతిపాదనల్లో మీకు నచ్చనివి తొలగిస్తాం’, చర్చలకు రండి, రైతు సంఘాలతో కేంద్రమంత్రి తోమర్

| Edited By: Pardhasaradhi Peri

Dec 23, 2020 | 7:03 PM

కేంద్ర ప్రతిపాదనలపై చర్చించేందుకు రైతు సంఘాలు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. 'మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసిన ప్రతిపాదనల్లో..

మీకు ఏం కావాలో చెప్పండి, మా ప్రతిపాదనల్లో మీకు నచ్చనివి తొలగిస్తాం, చర్చలకు రండి, రైతు సంఘాలతో కేంద్రమంత్రి తోమర్
Follow us on

కేంద్ర ప్రతిపాదనలపై చర్చించేందుకు రైతు సంఘాలు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. ‘మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేసిన ప్రతిపాదనల్లో అదనంగా ఏమైనా కలపాలంటే కలుపుతాం, లేదా మీరు కోరితే వేటినైనా తొలగిస్తాం అన్నారు. మీకు అనువైన తేదీ కోసం ఎదురు చూస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే పాండమిక్ సమయంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద ఈ 8 నెలల్లో రైతులకు లక్ష కోట్లను బ్యాంకులు వారికి అందజేసినందుకు వాటికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి అన్నదాతలు తమలో తాము చర్చించుకుని కేంద్రంతో చర్చలకు వస్తారని ఆశిస్తున్నామన్నారు.

కాగా తమను రైతు సంఘాలుగా చెప్పుకొంటున్న వాటితో ప్రభుత్వం రోజూ చర్చలు జరుపుతోందని, కానీ వాటికి తమకు సంబంధం లేదని రైతుల పక్షాన పోరాటం జరుపుతున్న యోగేంద్ర యాదవ్ అన్నారు. మా  ఆందోళనతో వాటికి ప్రమేయం లేదన్నారు. మమ్మల్ని ప్రభుత్వం ప్రతిపక్షంగా చూస్తోందని ఆయన ఆరోపించారు. అటు-ఈ నెల 23 నుంచి 26 వరకు ‘షాహీద్ దివస్’ గా పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం సింఘు బోర్డర్ చేరుకొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మీకు మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం అన్నారు. మరోవైపు రైతు చట్టాలకు మద్దతుగా ప్రభుత్వానికి 3 లక్షల సంతకాలతో  కూడిన పత్రాలు అందాయి.