అమెరికా ఎన్నికలముందు, ఫేస్ బుక్ సంచలన ప్రకటన

| Edited By: Pardhasaradhi Peri

Sep 03, 2020 | 5:51 PM

అమెరికా ఎన్నికలకు వారం రోజుల ముందు తాము అన్ని కొత్త పొలిటికల్ యాడ్ లను నిషేధిస్తామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్  బెర్గ్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రచారాల్లో 'బ్యాడ్ స్పీచ్ ' ను నిషేధించే యత్నంలో భాగమే ఇదన్నారు..

అమెరికా ఎన్నికలముందు, ఫేస్ బుక్ సంచలన ప్రకటన
Follow us on

అమెరికా ఎన్నికలకు వారం రోజుల ముందు తాము అన్ని కొత్త పొలిటికల్ యాడ్ లను నిషేధిస్తామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్  బెర్గ్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రచారాల్లో ‘బ్యాడ్ స్పీచ్ ‘ ను నిషేధించే యత్నంలో భాగమే ఇదన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ నేత, అధ్యక్ష పదవికి డెమొక్రాట్ క్యాండిడేట్  జో బిడెన్ మధ్య హోరాహోరీ పోటీ నేపథ్యంలో ఫేస్ బుక్ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత ప్రధానమైనదిగా భావిస్తున్నారు. ఎన్నిక జరగడానికి ఇక రెండు నెలలు మాత్రమే ఉంది. ఈ  ఎలెక్షన్ సాధారణ బిజినెస్ వంటిది కాదని పేర్కొన్న జుకర్ బెర్గ్, అమెరికా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ట్రంప్ తో బాటు అభ్యర్థులందరికీ తమ పాలసీలు వర్తిస్తాయన్నారు.