Tesla Ceo Elon Musk: నాకు కోవిడ్ 19 వచ్చిందేమో ! ఓసారి పాజిటివ్, మరోసారి నెగెటివ్ ! తేల్చుకోలేని ఎలన్ మస్క్

| Edited By: Pardhasaradhi Peri

Nov 15, 2020 | 11:58 AM

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తనకు కోవిడ్ 19 వచ్చిందో లేదో తెలియక సతమతమవుతున్నారు. బహుశా ఇది మోడరేట్ కేసేమో అని తర్జనభర్జన పడుతున్నారు. వేర్వేరు ల్యాబ్ ల నుంచి తనకు వేర్వేరు..

Tesla Ceo Elon Musk:  నాకు కోవిడ్ 19 వచ్చిందేమో ! ఓసారి  పాజిటివ్, మరోసారి నెగెటివ్ ! తేల్చుకోలేని ఎలన్ మస్క్
Follow us on

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తనకు కోవిడ్ 19 వచ్చిందో లేదో తెలియక సతమతమవుతున్నారు. బహుశా ఇది మోడరేట్ కేసేమో అని తర్జనభర్జన పడుతున్నారు. వేర్వేరు ల్యాబ్ ల నుంచి తనకు వేర్వేరు టెస్ట్ ఫలితాలు అందాయన్నారు. స్వల్పంగా కరోనా వైరస్ సోకిందేమో అంటున్నారు. లైట్ గా జలుబు లక్షణాలు ఉన్నాయని, ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదని అన్నారు. కరోనా వైరస్ కూడా ఓ టైపు కోల్డ్ లాంటిదే కదా అని వ్యాఖ్యానించారు. . రాపిడ్ టెస్టుల కన్నా ఖచ్చితమైన పోలిమెరాస్ చైన్ రియాక్షన్ టెస్టులు చేయించుకున్నానని, కానీ ఓ మెషిన్ లో ఓ రోజు పాజిటివ్ అని వస్తే అదే రోజున అదే మెషిన్ నుంచి నెగెటివ్ అని వచ్చిందని ఎలన్ మస్క్ తెలిపారు. మరి వీటిలో ఏ ఫలితాన్ని నమ్మాలి అని ప్రశ్నించారు. టెస్లా వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ సీఈఓ కే ఇలాంటి అనుభవం కలిగితే ఇక సామాన్యుల సంగతేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.