ఇయర్ ఫోన్స్‌తో జాగ్రత్త.. అతిగా వాడారో అంతే సంగతులు.. హెచ్చరిస్తున్న ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌లు..

మీరు రోజూ ఇయర్ ఫోన్స్ వాడుతారా అయితే అంతే సంగతులు.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వినికిడి పరీక్షలు చేసుకోండి.. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు వినికిడి సమస్యలకు గురవుతున్నారు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు..

ఇయర్ ఫోన్స్‌తో జాగ్రత్త.. అతిగా వాడారో అంతే సంగతులు.. హెచ్చరిస్తున్న ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌లు..
Follow us

|

Updated on: Nov 20, 2020 | 12:42 PM

మీరు రోజూ ఇయర్ ఫోన్స్ వాడుతారా అయితే అంతే సంగతులు.. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వినికిడి పరీక్షలు చేసుకోండి.. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు వినికిడి సమస్యలకు గురవుతున్నారు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. సాక్షాత్ ముంబైలోని జేజే ఆస్పత్రి ఈఎన్‌టీ డాక్టర్లు వెల్లడించారు. దీనికి గల కారణాలను కూడా తెలియజేశారు..లాక్‌డౌన్ వల్ల చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట ఇదే పని చేస్తున్నారు.. దీంతో గంటల తరబడి చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దాదాపుగా 9 నెలల నుంచి ఇదే పని చేస్తున్నారు.. దీంతో వారికి తెలియకుండానే వినికిడి సమస్యలకు గురవుతున్నారు. కనుక వీలైనంత తక్కువగా వాటి వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అధిక శబ్దంతో గంటల తరబడి ఉండటం వల్ల శాశ్వతంగా చెవిటి వారిగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వర్క్ ప్రం హోం చేసేటప్పుడు మధ్య మధ్యలో ఇయర్ ఫోన్స్ తీసి చెవిలోకి గాలి వెళ్లే విధంగా చూసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు చెవులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.