భారత్‌పై అణు బాంబు వేయాలి: పాక్ జర్నలిస్ట్

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:33 PM

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య పలు అంశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ మీద కోపంతో భారత్ తీసుకున్న పలు నిర్ణయాల్లో వ్యాపార పరమైనది ఒకటి. పాకిస్థాన్‌ నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచింది. దీంతో అది పాక్‌కు చాలా నష్టం కలిగిస్తోంది. దీంతో భారత్‌లో పాక్ బోర్డర్‌‌లో రాష్ట్రాల నుంచి నిత్యం పాకిస్థాన్‌కు వెళ్లే టామాటాల ఎగుమతిని నిలిపివేశారు. ఇది ముఖ్యంగా రాజస్థాన్‌లోని స్థానిక వ్యాపారులు […]

భారత్‌పై అణు బాంబు వేయాలి: పాక్ జర్నలిస్ట్
Follow us on

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య పలు అంశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ మీద కోపంతో భారత్ తీసుకున్న పలు నిర్ణయాల్లో వ్యాపార పరమైనది ఒకటి. పాకిస్థాన్‌ నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచింది. దీంతో అది పాక్‌కు చాలా నష్టం కలిగిస్తోంది. దీంతో భారత్‌లో పాక్ బోర్డర్‌‌లో రాష్ట్రాల నుంచి నిత్యం పాకిస్థాన్‌కు వెళ్లే టామాటాల ఎగుమతిని నిలిపివేశారు.

ఇది ముఖ్యంగా రాజస్థాన్‌లోని స్థానిక వ్యాపారులు తీసుకున్న నిర్ణయం. ఇక్కడి భారతీయులకు ఉచితంగా అయినా పంపిణీ చేస్తాం కానీ పాకిస్థాన్‌కు మాత్రం ఎగుమతి చేసేది లేదంటూ స్థానిక వ్యాపారులు పాక్‌పై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో పాక్‌లో టమాటాల ధరలు ఆకాశాన్నంటాయి.

కిలో రూ. 200 కంటే ఎక్కువగా పలుకుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఒక పాకిస్థానీ జర్నలిస్టే టీవీలో లైవ్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు టమాటాలు ఆపేస్తారా.. భారత్‌పై అణు బాంబు వేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ తీవ్రంగా స్పందించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.