కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారం.. టర్కీకి భారత్ ఝలక్

| Edited By: Pardhasaradhi Peri

Feb 15, 2020 | 12:25 PM

కాశ్మీర్ అంశంపై  పాకిస్తాన్ తో టర్కీ గళం కలపడంపట్ల ఇండియా భగ్గుమంది. పాక్ పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగాన్.. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. కాశ్మీర్ విషయంలో  పాక్ వైఖరిని సమర్థించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయాలకు తాను మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అంశం తమ అంతర్గత వ్యవహారమని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా.. దాన్ని పట్టించుకోని ఎర్డోగాన్.. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా దశాబ్దాల తరబడి కాశ్మీర్ ప్రజలు […]

కాశ్మీర్ మా అంతర్గత వ్యవహారం.. టర్కీకి భారత్ ఝలక్
Follow us on

కాశ్మీర్ అంశంపై  పాకిస్తాన్ తో టర్కీ గళం కలపడంపట్ల ఇండియా భగ్గుమంది. పాక్ పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైపీ ఎర్డోగాన్.. ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిస్తూ.. కాశ్మీర్ విషయంలో  పాక్ వైఖరిని సమర్థించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయాలకు తాను మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు. ఈ అంశం తమ అంతర్గత వ్యవహారమని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా.. దాన్ని పట్టించుకోని ఎర్డోగాన్.. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా దశాబ్దాల తరబడి కాశ్మీర్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఇటీవలి ఏకపక్ష నిర్ణయాల కారణంగా ‘ మన కాశ్మీరీ సోదరసోదరీమణుల’ సమస్యలు మరిన్ని పెరిగాయని అన్నారు. (గత ఏడాది ఆగస్టులో భారత ప్రభుత్వం కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్నిరద్దు చేసిన సంగతి విదితమే). కాశ్మీర్ సమస్య పాకిస్థాన్ కు ఎంత ప్రధానమో తమకు కూడా అంతే ప్రధానమని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. న్యాయం, నిష్పాక్షికతలపై  ఆధారపడిన ఓ పరిష్కారం అన్ని వర్గాల ప్రయోజనాలకు దోహదపతుందని,  ఇందుకు శాంతియుత చర్చలే ప్రాతిపదిక అవుతాయని ఆయన అన్నారు. గత ఏడాది సెప్టెంబరులో కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తి పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడారు.

అయితే పాక్ పర్యటనలో ఎర్డోగాన్ మళ్ళీ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినందుకు ఇండియా భగ్గుమంది. ఇది మా ఆంతరంగిక వ్యవహారమని స్పష్టం చేస్తూ.. మీ జోక్యాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. టర్కీ-పాకిస్థాన్ జాయింట్ డెక్లరేషన్ ను తిరస్కరిస్తున్నాం అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం ఇండియాకు, ఈ ఉపఖండానికి ముప్పుగా పరిణమిస్తోందని, ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ఎర్డోగాన్ మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.