ఆస్పత్రిలో డాక్టర్-నర్సు పెళ్లి….పేషంట్లే బంధువులు

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 8:18 PM

లండన్ లో ఓ డాక్టర్, నర్సు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆసుపత్రిలోనే వీరి పెళ్లి జరగడం విశేషం. 34 ఏళ్ళ జాన్ ట్రిప్పింగ్ అనే డాక్టర్, 30 ఏళ్ళ అన్నాలన్ నవరత్నం అనే నర్సు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఆస్పత్రిలో డాక్టర్-నర్సు పెళ్లి....పేషంట్లే బంధువులు
Follow us on

లండన్ లో ఓ డాక్టర్, నర్సు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆసుపత్రిలోనే వీరి పెళ్లి జరగడం విశేషం. 34 ఏళ్ళ జాన్ ట్రిప్పింగ్ అనే డాక్టర్, 30 ఏళ్ళ అన్నాలన్ నవరత్నం అనే నర్సు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత ఆగస్టులోనే పెళ్లి చేసుకుందామనుకున్నా.. తమ కుటుంబాలు నార్తరన్ ఐర్లాండ్ నుంచి, శ్రీలంక నుంచి ఇక్కడికి రాలేవని భావించి ఈ మధ్యే తాము పని చేస్తున్న ఆసుపత్రిలోనే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లండన్ లోని సెయింట్ థామస్ ఆసుపత్రిలో జరిగిన వీరి వివాహానికి రోగులే బంధువులయ్యారు. కాస్త ఆలస్యంగా వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి.