ఢిల్లీ అల్లర్ల కేసులో ఫేస్ బుక్ కి ‘సుప్రీం’ ఊరట

| Edited By: Pardhasaradhi Peri

Sep 23, 2020 | 6:41 PM

ఢిల్లీ అల్లర్ల కేసులో ఫేస్ బుక్ ఇండియా ఎండీ, వైస్ చైర్మన్ అజిత్ మోహన్ కి సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట లభించింది. ఆయనపై అక్టోబరు 15 వరకు ఎలాంటి 'బలవంతపు' చర్య తీసుకోరాదని ఢిల్లీ అసెంబ్లీ కమిటీని సుప్రీంకోర్టు..

ఢిల్లీ అల్లర్ల కేసులో ఫేస్ బుక్ కి సుప్రీం ఊరట
Follow us on

ఢిల్లీ అల్లర్ల కేసులో ఫేస్ బుక్ ఇండియా ఎండీ, వైస్ చైర్మన్ అజిత్ మోహన్ కి సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట లభించింది. ఆయనపై అక్టోబరు 15 వరకు ఎలాంటి ‘బలవంతపు’ చర్య తీసుకోరాదని ఢిల్లీ అసెంబ్లీ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణలు, అల్లర్లకు సంబంధించి తమ ముందు ఈ నెల 23 న హాజరు కావలసిందిగా ఈ పానెల్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఫేస్ బుక్ ఇండియా అనేక ‘రెచ్ఛగొట్టుడు’ ప్రసంగాలను వ్యాపింపజేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ పానెల్ తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ అజిత్ సుప్రీంకోర్టుకెక్కారు. ఆయన తరఫున కోర్టులో వాదించిన ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ..అసలు ఫేస్ బుక్ సాధనాన్ని దుర్వినియోగమవుతోందని, ఇలా జరగకుండా ఈ పానెల్ నేతలకు  సూచనలు చేయాలని కోరారు.

ఇది (ఫేస్ బుక్) నిందితురాలు కాదు, ఒకవిధంగా బాధితురాలే.. ఇది ఎలా దుర్వినియోగమవుతోందో చూడండి అని న్యాయమూర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.