భారత ప్రభుత్వ నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం, ఆగ్నేసియాలో కోవిడ్ పై పోరును బలోపేతం చేస్తుందని వ్యాఖ్య,

| Edited By: Anil kumar poka

Jan 03, 2021 | 8:28 PM

కోవిడ్ 19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది.

భారత ప్రభుత్వ నిర్ణయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం, ఆగ్నేసియాలో  కోవిడ్ పై పోరును బలోపేతం చేస్తుందని వ్యాఖ్య,
Follow us on

కోవిడ్ 19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం ఆగ్నేసియాలో కరోనా వైరస్ పై జరిపే పోరును మరింత బలోపేతం చేస్తుందని ఈ ప్రాంత రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనం  క్షేత్రపాల్ సింగ్ అన్నారు. ప్రయారిటీ గ్రూపుల ప్రకారం టీకామందు ఇచ్చేందుకు, అదే సమయంలో అత్యవసర వినియోగానికి ఇచ్చిన అనుమతితో బాటు ఇతర ఆరోగ్య పరమైన చర్యలు తీసుకోవాలన్న భారత అభిమతం ముఖ్యంగా కోవిడ్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇతర దేశాలు కూడా ఇండియాను ఆదర్శంగా తీసుకోగలవన్న ఆశా భావాన్ని ఆమె వ్యక్తం చేశారు.

కాగా- భారత్ బయోటెక్ సంస్థ డెవలప్ చేసిన కొవాగ్జిన్ సేఫ్టీపై డేటాను సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ  సమగ్రంగా సమీక్షించింది. అత్యవసర వినియోగానికి దీన్ని అనుమతించవచ్చునని సిఫారసు చేయగా దాన్ని డీ సీ జీ ఐ ఆమోదించింది. తమ కంపెనీ ఈ వ్యాక్సిన్ తయారీలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని, ఇందులో రీసెర్చర్ల కృషి ఎంతో ఉందని భారత్ బయో టెక్ ప్రకటించింది.