అత్యాచార కొవిడ్ బాధితురాలు ఆత్మహత్యాయత్నం

|

Sep 19, 2020 | 9:31 PM

కేరళలో కరోనా బారినపడిన 19 ఏళ్ల యువతిని సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్తూ అంబులెన్స్‌ డ్రైవర్‌ చేసిన లైంగిక దాడి యావత్ దేశాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. అయితే, ఆ యువతి ఇప్పుడు ఆస్పత్రిలో..

అత్యాచార కొవిడ్ బాధితురాలు ఆత్మహత్యాయత్నం
Follow us on

కేరళలో కరోనా బారినపడిన 19 ఏళ్ల యువతిని సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్తూ అంబులెన్స్‌ డ్రైవర్‌ చేసిన లైంగిక దాడి యావత్ దేశాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. అయితే, ఆ యువతి ఇప్పుడు ఆస్పత్రిలో ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కేరళలో ఈ ఉదంతం మరోసారి సంచలనానికి కారణమైంది. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందించడంతో సదరు యువతి ప్రాణాలతో బయటపడింది. ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిన ఐసోలేషన్ వార్డులోని బాత్రూం తలుపులు తెరిచి ఆసుపత్రి సిబ్బంది ఆమెను రక్షించారు. ప్రస్తుతం బాధిత అమ్మాయి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఆమెను వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇలా ఉండగా, పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో సదరు యువతి బంధువుల ఇంట్లో ఉండేది. కరోనా లక్షణాలుండటంతో క్వారంటైన్‌లో ఉన్న ఆమెకు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. ఆమెతోపాటు మరొకరిని కరోనా సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ నౌఫాల్‌ (25) బాధితురాలి ఇంటికి వెళ్లాడు. ఇద్దరిని వేర్వేరు చోట్లకు తీసుకెళ్లాల్సి రావడంతో మొదట మహిళను ఓ హాస్పటల్‌లో వదిలేశాడు. బాధిత యువతిని మరో చోటుకు తీసుకెళ్తూ మార్గమధ్యలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అర్ధరాత్రి ఆమెను కోవిడ్‌ -19 సంరక్షణ కేంద్రంలో వదిలేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరన్ములా పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేశారు.