బ్రిటన్‌లో కోవిడ్‌-19 నిబంధనలు మరింత కఠినతరం

|

Sep 21, 2020 | 11:39 AM

బ్రిటన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశ మొదలయ్యింది.. సెకండ్‌ వేవ్‌ స్టార్ట్‌ కావడంతోనే కేసులు కూడా తీవ్రతరమవుతున్నాయి.. కరోనా కట్టడి కోసం బ్రిటన్‌ ఈసారి కఠిన ఆంక్షలను విధించింది.

బ్రిటన్‌లో కోవిడ్‌-19 నిబంధనలు మరింత కఠినతరం
Follow us on

బ్రిటన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశ మొదలయ్యింది.. సెకండ్‌ వేవ్‌ స్టార్ట్‌ కావడంతోనే కేసులు కూడా తీవ్రతరమవుతున్నాయి.. కరోనా కట్టడి కోసం బ్రిటన్‌ ఈసారి కఠిన ఆంక్షలను విధించింది.. ఈ ఆంక్షలను అతిక్రమిస్తే పది వేల పౌండ్ల జరిమానా విధించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం సంసిద్ధమయ్యింది.. మన కరెన్సీలో చెప్పాలంటే పది లక్షల రూపాయలు.. ఈ నెల 28 నుంచి కొత్త నిబంధనలను అమలు చేస్తారు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సదుపాయం లేనివారికి 500 పౌండ్లు ఇచ్చి ఆదుకుంటామని ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.. కోవిడ్‌-19 నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాయన! వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేయాలంటే కఠిన నిబంధనలు అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొందన్నారు బోరిస్‌ జాన్సన్‌. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇతర దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చిన వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి తీరాల్సిందేనని తెలిపారు.. ఒకవేళ ఈ నియమాన్ని పాటించకపోతే వెయ్యి నుంచి పది వేల పౌండ్ల జరిమానా విధిస్తామని చెప్పారు.. ఆరుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దనే నిబంధనను కూడా కొందరు పాటించడం లేదని తెలిపారు బోరిస్‌ జాన్సన్‌. యూరప్‌లోని ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాలలో కూడా ఇదే పరిస్థితి. తగ్గినట్టే తగ్గిన కేసులు మళ్లీ విజృంభించసాగాయి.