టీటీడీ అర్చకునికి 6 నెలల జైలు శిక్ష

తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ కోదండరామ స్వామి ఆలయంలోని బంగారు నగలు తాకట్టు పెట్టిన కేసులో ప్రధాన అర్చకునికి 6 నెలలు జైలు శిక్ష పడింది.

టీటీడీ అర్చకునికి 6 నెలల జైలు శిక్ష
Follow us

|

Updated on: Sep 30, 2020 | 11:30 AM

తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని బంగారు నగలు తాకట్టు పెట్టిన కేసులో ప్రధాన అర్చకునికి 6 నెలలు జైలు శిక్ష పడింది. 2009లో స్వామివారి బంగారు ఆభరణాలను ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు తాకట్టు పెట్టారు. ఈ మేరకు 2009 ఆగస్టు 21న టిటిడి విజిలెన్స్ ఫిర్యాదు మేరకు  తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ఆలయ ప్రధాన అర్చకుడుతో పాటు కుదువ వ్యాపారులు సాగరమల్లు, రాఘవరెడ్డి లపై ఐపీసీ 409, 420, 411 కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన అదనపు మున్సిఫ్ కోర్టు 2015లో ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులుతో పాటు మరో ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష, 5 వేలు జరిమానా విధించింది. తీర్పుపై ఆలయ ప్రధాన అర్చకుడు వెంకట రమణ దీక్షితులు  అప్పీలుకు వెళ్లారు. ఈ మేరకు ఇరు వర్గాల వాదనలు విన్న మూడవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు తాజాగా తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడుగా ఉన్న వెంకట రమణ దీక్షితులుకు 6 నెలల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయలు జరిమానా విధించింది. మిగతా ఇద్దరిపై కేసు కొట్టివేసింది.

Also Read :

Breaking : పురంధరేశ్వరికి కరోనా పాజిటివ్ !

ఏపీ : నేడు బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్‌ పోస్టులు ప్రకటన !

Latest Articles